Srisailam Traffic Jam: శ్రీశైలం ఆలయానికి పోటెత్తిన భక్తులు

Follow Us: Google News Daily Hunt
Devotees flock to Srisailam in large numbers.
Devotees flock to Srisailam in large numbers.
FONT SIZE
GET APP

Srisailam Traffic Jam:శ్రీశైలానికి భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. శైవ క్షేత్రమైన శ్రీశైల ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో పోటెత్తారు. నంద్యాల జిల్లా పరిధిలోని శ్రీశైలం ఘాట్ రోడ్లలో వాహనాలు నిలిచిపోయాయి. సెలవుదినం కావడంతో తెలుగు రాష్ట్రాల నుండి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు.

Read also: AP Junior Doctors Strike: ఏపీలో రేపటి నుంచి అత్యవసర సేవలు బంద్

Devotees flock to Srisailam in large numbers.
Devotees flock to Srisailam in large numbers.

ఘాట్ రోడ్లలో నిలిచిన వాహనాలు

ఆలయానికి వెళ్లే ఘాట్ రోడ్లలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వాహనాల రద్దీ విపరీతంగా పెరగడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్ సిబ్బంది రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. నిలిచిపోయిన వాహనాలను ముందుకు కదిలించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

Srisailam Traffic Jam:స్వామివారి దర్శనానికి నాలుగు గంటలు

భక్తుల రద్దీ కారణంగా స్వామివారి దర్శనానికి సమయం పడుతోంది. మల్లన్న దర్శనానికి ప్రస్తుతం నాలుగు గంటల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు. భక్తులు సంయమనం పాటించి అధికారులకు సహకరించాలని ఆలయ సిబ్బంది విజ్ఞప్తి చేశారు. భద్రతా చర్యలను పటిష్టం చేసి వరుస క్రమంలో దర్శనాలు కల్పిస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Siva Prasad

రచయిత గురించి

Siva Prasad

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు