Schools Reopen : తెలంగాణ వ్యాప్తంగా దసరా పండుగ సెలవులు పూర్తవ్వడంతో నేటి నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. పండుగ వాతావరణం ముగియడంతో విద్యార్థులు మళ్లీ విద్యాభ్యాసంలో నిమగ్నం కానున్నారు. ఈ మేరకు సెలవుల ముగింపు, బడులు తెరిచే తేదీపై ఇప్పటికే పలు ప్రైవేట్ యాజమాన్యాలు, యాజమాన్య ప్రతినిధులు తల్లిదండ్రుల మొబైల్ ఫోన్లకు సమాచారాన్ని మెసేజ్‌ల రూపంలో పంపించారు. విద్యార్థులు సకాలంలో తరగతులకు హాజరయ్యేలా చూడాలని కోరారు. ఇక పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్నటి నుంచే (గురువారం) పాఠశాలలు పునఃప్రారంభమై తరగతులు యథావిధిగా కొనసాగుతున్నాయి.
Read Also : ఏపీ మున్సిపల్ ఎన్నికలు రీషెడ్యూల్.. నవంబర్ 1న పోలింగ్AP

వీకెండ్ ఎఫెక్ట్ – సొంత ఊళ్లలోనే చాలా కుటుంబాలు
అయితే దసరా సెలవుల ముగింపు రోజు వారంలో తుది రోజులకు (వీకెండ్) దగ్గరగా ఉండటంతో పట్టణ వాసుల ప్రయాణాలపై దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. పండుగ సెలవులకు సొంత ఊళ్లకు వెళ్లిన హైదరాబాద్ మరియు ఇతర ప్రధాన పట్టణాలకు చెందిన అనేక కుటుంబాలు ఇంకా నగరాలకు తిరుగు ప్రయాణం కాలేదు. శుక్రవారం ఒక్క రోజు పాఠశాలకు పంపే బదులు, శని, ఆదివారాలు కూడా ఊరిలోనే గడిపి, నేరుగా సోమవారం (26వ తేదీ) నాడే పిల్లలను స్కూళ్లకు పంపాలని చాలామంది తల్లిదండ్రులు భావిస్తున్నారు. దీంతో ప్రధాన రహదారులు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో ఆదివారం నాటికి రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :