Raptadu School Incident: రాప్తాడు ఘటనపై సీఎం చంద్రబాబు, లోకేశ్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. కఠిన చర్యలకు ఆదేశం

Follow Us: Google News Daily Hunt
Raptadu School Incident
Raptadu School Incident
FONT SIZE
GET APP

Raptadu School Incident: అనంతపురం జిల్లా రాప్తాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిపై ఉన్మాది రంపంతో అమానుషంగా దాడి చేసిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాల తరగతి గదిలోనే విద్యార్థినిపై ఇలాంటి దారుణానికి ఒడిగట్టడంపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ, ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు.

Read Also : Shadnagar Govt Hospital: షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో విషాదం.. ప్రసవం కోసం వచ్చి తల్లీబిడ్డ మృతి

Raptadu School Incident
CM Chandrababu and Lokesh deeply shocked by Raptadu incident

Raptadu School Incident: మెరుగైన వైద్యం అందించాలని సీఎం ఆదేశం

దాడిలో తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిపై సీఎం చంద్రబాబు అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితురాలికి మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని, చికిత్సలో ఎలాంటి లోటుపాట్లు రాకుండా చూడాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ అమానుష ఘటనకు పాల్పడిన ఉన్మాదిని తక్షణమే అరెస్ట్ చేసి చట్టపరంగా అత్యంత కఠినంగా శిక్షించాలని పోలీసు యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పేర్కొన్నారు.

ఉన్మాదులను ఉక్కుపాదంతో అణిచివేస్తాం: మంత్రి నారా లోకేశ్ హెచ్చరిక

ఈ దారుణ సంఘటనపై స్పందించిన మంత్రి నారా లోకేశ్ తీవ్ర ఆవేదనకు గురయ్యారు. చిన్నారి చెల్లిని నెత్తుటి మడుగులో చూశాక కన్నీళ్లు ఆగడం లేదని, గుండె బరువెక్కిందని ఎమోషనల్ అయ్యారు. సమాజంలో ఇలాంటి ఉన్మాదులను ఉక్కుపాదంతో అణిచివేస్తామని హెచ్చరించారు.

మహిళలు, ఆడపిల్లల వైపు కన్నెత్తి చూడాలన్నా భయపడేలా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని లోకేశ్ స్పష్టం చేశారు. పాఠశాలల్లో పిల్లల భద్రత పట్ల నిర్లక్ష్యం వహించిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు