Nellore news:నలుగురు నిందితులు అరెస్ట్. రూ.10 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం, నగరంలోని పెద్దబజార్లో జరిగిన చోరీ కేసును చిన్నబజార్ పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. ఈ ఘటనలో ఇద్దరు నిందితులతో పాటు ఇద్దరు బాల నేరస్తులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి సుమారు రూ.10 లక్షల విలువైన 145.300 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను బుధవారం ఏఎస్పి దీక్ష మీడియాకు వెల్లడించారు. ఈనెల 2వ తేదీ పెద్దబజార్ ప్రాంతానికి చెందిన షేక్ అజ్మత్ తన ఇంటికి రాగా, బీరువా లాకర్ తెరిచి ఉండటాన్ని గమనించారు. అందులోని బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు గుర్తించి, ఆమె వెంటనే చిన్నబజార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జిల్లా ఇంచార్జి ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు, అడిషనల్ ఎస్పీ సౌజన్య పర్యవేక్షణలో, నెల్లూరు టౌన్ ఏఎస్పి దీక్ష ఆధ్వర్యంలో చిన్న బజార్ సీఐ శ్రీనివాసరావు నేతృత్వంలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.
Read also: Collectorate AO Chandrasekhar: కలెక్టరేట్ ఏవోగా చంద్రశేఖర్ బాధ్యతల స్వీకరణ!

Nellore news:అభినందనలు పొందిన పోలీస్ అధికారులు
నిందితుల కదలికలపై నిఘా ఉంచిన పోలీసులు, 9న పెద్దబజార్, డైకస్ రోడ్ సెంటర్ సమీపంలోని చేపల మార్కెట్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న షేక్ ఇర్ఫాన్ (19), మొహమ్మద్ ఆబిద్(20)లతో పాటు ఇద్దరు బాల నేరస్తులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితులు నేరాన్ని అంగీకరించడంతో, వారి నుంచి బంగారు ఆభరణాలను రికవరీ చేశారు. అనంతరం నిందితులను న్యాయస్థానంలో హాజరుపరిచినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసును త్వరితగతిన ఛేదించడంలో కీలకంగా వ్యవహరించిన చిన్నబజార్ సీఐ ఎస్. శ్రీనివాసరావు, ఎస్ఐలు రజాక్, అయ్యప్ప, వారి క్రైమ్ సిబ్బందిని జిల్లా ఇంచార్జి ఎస్పీ, టౌన్ ఏఎస్పీ అభినందించి రివార్డులు అందచేశారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: