Murasu Cyclone: బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మురసు’ అల్పపీడనం బలపడి ఇప్పుడు తీవ్ర తుపానుగా రూపాంతరం చెందింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఈ తుపాను నేడు అర్ధరాత్రి నుంచి రేపు (మంగళవారం) తెల్లవారుజాము మధ్యలో నెల్లూరు – నర్సాపురం మధ్య, ముఖ్యంగా ఒంగోలు సమీపంలో తీరం దాటే ఛాన్స్ ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) అధికారికంగా వెల్లడించింది.

ఒంగోలుకు చేరువలో ‘మురసు’ తీవ్ర తుపాను
సోమవారం ఉదయం నాటికి ఈ తీవ్ర తుపాను ఒంగోలుకు 330 కి.మీ, అలాగే నెల్లూరుకు 290 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు ఏపీఎస్‌డీఎంఏ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇది క్రమంగా తీరం వైపునకు కదులుతోంది. ఈ తుపాను తీరం దాటే కీలక సమయంలో గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో, కొన్ని సందర్భాల్లో గరిష్ఠంగా 120 కిలోమీటర్ల వేగంతో ప్రచండ ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
Read also: AP Municipal Elections: ఏపీలో మూడు చోట్ల మళ్లీ పోలింగ్.. ఎస్ఈసీ సంచలన నిర్ణయం!
Murasu Cyclone: పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
తుపాను ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్రతో పాటు రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల దృష్ట్యా నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, బాపట్ల మరియు కృష్ణా జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యే ప్రమాదం ఉండటంతో అధికార వర్గాలు ముందస్తు చర్యలు చేపట్టాయి.
ఎగిసిపడనున్న సముద్రపు అలలు.. మత్స్యకారులకు హెచ్చరిక
తుపాను ధాటికి బాపట్ల, కృష్ణా, ప్రకాశం జిల్లాల తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారనుంది. తీర ప్రాంతాల్లో 1.0 నుంచి 1.5 మీటర్ల ఎత్తున భారీ అలలు (స్టార్మ్ సర్జ్) ఎగిసిపడే ప్రమాదం ఉందని ఏపీఎస్‌డీఎంఏ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ సముద్రంలోకి వేటకు వెళ్లరాదని కఠిన నిబంధనలు జారీ చేశారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :