Vizag : ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం HPCL రిఫైనరీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రిఫైనరీలోని పిచ్ ఇంటర్మీడియట్ స్టోరేజ్ ట్యాంకులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో కలకలం రేగింది. ఈ ఘటనతో అప్రమత్తమైన రిఫైనరీ ఫైర్ అండ్ సేఫ్టీ బృందాలు వెంటనే రంగంలోకి దిగాయి. అత్యవసర భద్రతా చర్యలు చేపట్టి మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా చర్యలు తీసుకున్నాయి. సిబ్బంది సమన్వయంతో అగ్నిమాపక చర్యలు చేపట్టి కొద్దిసేపట్లోనే మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో రిఫైనరీ పరిసరాల్లో నెలకొన్న ఆందోళన తగ్గింది.
Read Also: హేమంత్ ను అక్కడే చంపాల్సింది – ప్రత్యక్ష సాక్షి ఆవేదన
ప్రాణనష్టం లేదు.. యథావిధిగా కొనసాగుతున్న కార్యకలాపాలు
ఈ అగ్నిప్రమాదంపై HPCL అధికారికంగా స్పందించింది. ఫైర్ అండ్ సేఫ్టీ బృందం తక్షణమే స్పందించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చినట్లు వెల్లడించింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని స్పష్టం చేసింది. అంతేకాకుండా రిఫైనరీలోని అన్ని యూనిట్లు యథావిధిగా పనిచేస్తున్నాయని తెలిపింది. పారిశ్రామిక ప్రాంతాల్లో ఇలాంటి ప్రమాదాలు సంభవించినప్పుడు అత్యవసర భద్రతా వ్యవస్థలు ఎంత కీలకంగా పనిచేస్తాయో ఈ ఘటన మరోసారి గుర్తుచేసింది. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :