Gooty Train Robbery: మైసూర్-కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌లో దొంగల హల్‌చల్!

Follow Us: Google News Daily Hunt
Major train robbery near Gooty... Looted after tampering with the signal system!
Major train robbery near Gooty... Looted after tampering with the signal system!
FONT SIZE
GET APP

Gooty Train Robbery | అనంతపురం జిల్లా గుత్తి రైల్వే జీఆర్పీ పరిధిలో సంచలన ఘటన వెలుగుచూసింది. గుత్తి-కల్లూరు రైల్వే స్టేషన్ల మధ్య తురకపల్లి రైల్వే హాల్టింగ్ స్టేషన్ సమీపంలో గుర్తుతెలియని దుండగులు రైల్వే సిగ్నల్ వ్యవస్థను ట్యాంపరింగ్ చేసి రైలును నిలిపివేసి దోపిడీకి పాల్పడినట్లు సమాచారం.

Read Also: Tuni Gnyaneswari Missing Case Updates: జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో ఎస్పీ కీలక వ్యాఖ్యలు!

సోమవారం తెల్లవారుజామున మైసూర్ నుంచి కాచిగూడ వెళ్తున్న 12786 ఎక్స్‌ప్రెస్ రైలును ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తురకపల్లి సమీపంలో నిలిపివేసినట్లు అధికారులు భావిస్తున్నారు. రైలు ఆగిన వెంటనే ముసుగులు ధరించిన దుండగులు ఎస్-2, ఎస్-4, ఎస్-6, ఎస్-7 బోగీల్లోకి ప్రవేశించి ప్రయాణికుల ఆస్తులను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడ్డారు.

ఈ ఘటనలో రేణుక అనే మహిళా ప్రయాణికురాలి వద్ద ఉన్న 37 గ్రాముల బంగారు ఆభరణాలు, అనంతపురానికి చెందిన యశోదమ్మ వద్ద ఉన్న 4.2 గ్రాముల నల్లపూసల దండ, మైసూర్‌కు చెందిన వైష్ణవి వద్ద ఉన్న ఐఫోన్ 15, మైసూర్ నుంచి మహబూబ్‌నగర్ వెళ్తున్న సుచిత్ర వద్ద ఉన్న ఐదు తులాల బంగారు ఆభరణాలు అపహరించబడినట్లు సమాచారం. మరో ప్రయాణికురాలు అంబికా వద్ద కూడా చోరీకి ప్రయత్నించినప్పటికీ అది విఫలమైంది.

స్థానికుల సమాచారం ప్రకారం గతంలో కూడా ఇదే ప్రాంతంలో రైలు ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని దోపిడీలు(Gooty Train Robbery) జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ఐఆర్‌పీసీఎఫ్ ఇన్‌స్పెక్టర్ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో గుత్తి రైల్వే జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సిగ్నల్ వ్యవస్థలో జరిగిన ట్యాంపరింగ్ అంశంపై సాంకేతిక నిపుణులతో కలిసి విచారణ కొనసాగిస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read also Epaper: epaper.vaartha.com

read also:

Siva Prasad

రచయిత గురించి

Siva Prasad

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు