ap: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల (పెన్షనర్లు) ఆరోగ్య భద్రతకు సంబంధించి కూటమి ప్రభుత్వం బిగ్ అప్‌డేట్ అందించింది. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (EHS) లో సమూల మార్పులు తీసుకొస్తూ, నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో ఉద్యోగులు ఒక్క రూపాయి కూడా జేబు నుంచి పెట్టాల్సిన అవసరం లేకుండా పూర్తిగా ‘వంద శాతం ఉచిత నగదు రహిత వైద్యాన్ని’ (Complete Cashless Treatment) అందించే దిశగా సర్కారు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అంతేకాకుండా, మెడికల్ రీయింబర్స్‌మెంట్ విధానంలో ఎదురవుతున్న తీవ్ర జాప్యానికి చెక్ పెడుతూ, ఉద్యోగుల నుంచి మినహాయించే చందాతో పాటు ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాంట్‌ను ప్రతి నెలా 1వ తేదీనే నేరుగా ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్ ఖాతాకు జమ చేసేలా జీవో నంబర్ 131ని కూడా ఇటీవల విడుదల చేసింది.
Read Also : నెల్లూరులో విషాద ఘటన.. వేడి సాంబార్‌లో పడి 12 మందికి తీవ్ర గాయాలు

ఉద్యోగ సంఘాల డిమాండ్లు.. ప్రభుత్వ నూతన ప్రతిపాదనలు
గతంలో హెల్త్ కార్డ్స్ ఉన్నప్పటికీ పలు ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులు నగదు రహిత సేవలు అందించేందుకు నిరాకరించడం, అలాగే క్లెయిమ్‌ల దాఖలులో జాప్యం జరగడంతో ఉద్యోగులు లక్షలాది రూపాయలు స్వయంగా ఖర్చు చేయాల్సి వచ్చేది. ఈ నేపథ్యంలో మెడికల్ రీయింబర్స్‌మెంట్ పరిమితిని పెంచడంతో పాటు ఎలాంటి ఆటంకాలు లేని సీమ్‌లెస్ క్యాష్‌లెస్ వైద్యాన్ని, ఏడాదికి ఒకసారి ఉచిత హెల్త్ చెకప్ సౌకర్యాన్ని కల్పించాలని ఉద్యోగ సంఘాలు కోరాయి. దానికి అనుగుణంగా ఉద్యోగుల నెలవారీ కంట్రిబ్యూషన్‌ను స్వల్పంగా సరిచేసి, మెడికల్ రీయింబర్స్‌మెంట్ స్థానే పూర్తిస్థాయి క్యాష్‌లెస్ నెట్‌వర్క్‌ను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవడంతో ఉద్యోగ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :