Collector Himanshu Shukla: గిరిజనులకు మౌలిక వసతులు తక్షణమే కల్పించాలి

Follow Us: Google News Daily Hunt
Collector Himanshu Shukla: గిరిజనులకు మౌలిక వసతులు తక్షణమే కల్పించాలి
FONT SIZE
GET APP

Collector Himanshu Shukla: జిల్లాలో గిరిజనులు ఎక్కువగా ఉన్న 20 గ్రామాలలో త్రాగు నీరు, విధ్యుత్ మరియు అంతర్గత రోడ్లు వంటి మౌలిక వసతులు తక్షణమే కల్పించాలని జిలా కలెక్టర్ హిమాన్షు శుక్లా సంబదిత అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయ స్థానిక కలెక్టర్ కార్యాలయములోని తిక్కన ప్రాంగణములో ఐ.టి.డి.ఎ ఆద్వర్యములో జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో యానాదులు, ఎరుకల, సుగాలీలు, చెంచులు మరియు నక్కల వాళ్ళు అధికంగా ఉన్న గ్రామాలలో సంబందిత 24 శాఖలు గిరిజనుల అభివృద్దికి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. పరిశ్రమల శాఖనుండి కనీసం 5 మందిని గుర్తించి వారిని ఔత్సాహిక పారిశ్రీమిక వేత్తలుగా ఎదిగే విధంగా 3 నేలల్లోపల తగిన చర్యలు తీసుకోవాలన్నారు.

Read also: Weather Update: కేరళను తాకనున్న రుతుపవనాలు..భారీ నుంచి అతి భారీ వర్షాలు: IMD

Collector Himanshu Shukla: గిరిజన గ్రామాలకు ప్రాధాన్యత

అదేవిధముగా మత్స్య శాఖ కూడా చెరువులు, బోట్ల మంజూరు విషయములో కనీసం 5 మందిని గుర్తించి వారికి అవసరమైన సహాయ సహకారాలు అందిచాలన్నారు. గిరిజనులు ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో విధ్యత్ సౌకర్యం కల్పించాలని విధ్యుత్ శాఖ అధికారులకు సూచించారు. బడి పిలుస్తోంది కార్యక్రమం ద్వారా గిరిజన పిల్లలను ఎక్కువ మందిని బడులలో చేర్పించాలని సూచించారు. జాతీయ ఉపాధి హామీ పధకంలో పని దినాల కల్పనలో కూడా ప్రాధాన్యత కల్పించాలని సంబందిత అధికారులను ఆదేశించారు. గ్రామీణాభివృద్ధి శాఖ స్వయం సహాయక గ్రూపుల ఏర్పాటులో గిరిజనులకు ప్రాధాన్యత కల్పించాలన్నారు. ఈ కార్యక్రమములో ఐ.టి.డి.ఎ పి.డి శ్రీనివాసులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొనారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Rajitha

రచయిత గురించి

Rajitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు