Gooty: రైలు బోగీల మధ్య విడిపోయిన కప్లింగ్.. గుత్తిలో 35 నిమిషాల పాటు నిలిచిపోయిన ఎక్స్‌ప్రెస్

Follow Us: Google News Daily Hunt
Gooty station train coupling issue
Gooty station train coupling issue
FONT SIZE
GET APP

Gooty:అనంతపురం జిల్లా గుత్తి రైల్వే స్టేషన్ ప్లాట్ ఫారం నంబర్ 1 లో నిలిపి ఉన్న యశ్వంత్ పూర్ ప్రత్యేక రైలు ఎక్స్ప్రెస్ కు రెండు కంపార్ట్మెంట్ నడుమ ఉన్న లాకులు విడిపోవడంతో రైలును స్టేషన్లోనే అత్యవసర పరిస్థితులలో నిలిపివేశారు..
వివరాలు ఇలా ఉన్నాయి.. యశ్వంతపూర్ నుండి కటీహర్ వెళ్లే ఎక్స్ప్రెస్ రైలు ( నెంబర్ 06571 ) మంగళవారం స్థానిక రైల్వే స్టేషన్ లో ఒకటవ ప్లాట్ఫారంకు చేరుకుంది.ఈ నేపథ్యంలో S 6,S7 రైలు భోగిల మధ్యలో ఉన్న జాయింట్ స్క్రూ కప్లింగ్ విడిపోయాయి…. అప్రమత్తమై న లోకో పైలట్ గమనించి రైల్వే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.. దీంతో టెక్నీషియన్ రైల్వే సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు చేపట్టారు… మరమత్తుల అనంతరం రైలు 35 నిమిషాలకు ఆలస్యంగా బయలుదేరింది..ఈ సంఘటన పై రైల్వే అధికారులు విచారణ చేపట్టారు…

Read also: Weather Update: కేరళను తాకనున్న రుతుపవనాలు..భారీ నుంచి అతి భారీ వర్షాలు: IMD

Gooty station train coupling issue
Gooty station train coupling issue

Gooty: సాంకేతిక లోపం కారణంగా జరిగిందా…

లేదా మరో కారణంగా జరిగిందా… అన్న విభిన్న కోణాలలో అధికారులు దర్యాప్తు చేపట్టారు.యశ్వంతపూర్ – కటీహర్ ఎక్స్‌ప్రెస్ మంగళవారం గుత్తి స్టేషన్‌కు చేరుకున్న సమయంలో, ఎస్‌6 మరియు ఎస్‌7 బోగీల మధ్య ఉన్న జాయింట్ స్క్రూ కప్లింగ్ అకస్మాత్తుగా విడిపోయింది. అప్రమత్తమైన లోకో పైలట్ వెంటనే విషయాన్ని గుర్తించి రైలును స్టేషన్లోనే నిలిపివేశారు. ఈ ప్రమాదం వల్ల ప్రయాణంలో అంతరాయం కలగడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Rajitha

రచయిత గురించి

Rajitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు