AP Rains Today:ఏపీలో నేడు పిడుగులతో కూడిన భారీ వర్ష సూచన

Follow Us: Google News Daily Hunt
ap rains today lightning thunder
ap rains today lightning thunder
FONT SIZE
GET APP

AP Rains Today:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణం మారినందున ఇవాళ పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ముఖ్యంగా కొన్ని ప్రాంతాలలో ఉరుములు మెరుపులతో పాటు భారీ వర్షాలు పడే సూచనలు కనిపించాయి.

Read also: Thalliki Vandanam scheme:తల్లికి వందనం డబ్బులు రానివారు ఇలా చేయండి

ap rains today lightning thunder
ap rains today lightning thunder

వర్షాలు కురిసే ప్రధాన జిల్లాలు

శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, మార్కాపురం జిల్లాలలో మోస్తరు వర్షాలు పడనున్నాయి. అలాగే పార్వతీపురం మన్యం, పోలవరం, తూర్పుగోదావరి, పల్నాడు, తిరుపతి జిల్లాలలో అక్కడక్కడ తేలికపాటి వానలు కురిసే అవకాశం ఉంది. ఈ వర్షాల సమయంలో ప్రజలు చెట్ల కింద నిలబడవద్దని అధికారులు తెలిపారు.

AP Rains Today:ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

వర్షాలు పడే సమయంలో రైతులు, పశువుల కాపరులు సురక్షిత ప్రాంతాలలో తలదాచుకోవాలని హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా పిడుగులు పడే ప్రమాం ఉన్నందున బయటకు వెళ్లేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అత్యవసర పనులు ఉంటే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని విపత్తుల నిర్వహణ శాఖ స్పష్టం చేసింది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Rajitha

రచయిత గురించి

Rajitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు