Pak ISI Conspiracy : భారత రక్షణ వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ (ISI) పన్నిన పన్నిన కుట్రను ఆంధ్రప్రదేశ్ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు అత్యంత చాకచక్యంగా భగ్నం చేశారు. విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళం (Eastern Naval Command) తో పాటు దేశీయ నౌకాదళ కేంద్రాలలో పనిచేస్తున్న సిబ్బందిని టార్గెట్ చేస్తూ ఐఎస్ఐ ఆపరేటర్లు తీవ్రస్థాయిలో నిఘా పెట్టారు. సోషల్ మీడియా వేదికగా అందమైన యువతుల పేర్లతో నకిలీ ప్రొఫైళ్లను సృష్టించి, నేవీ ఉద్యోగులను హనీట్రాప్ లోకి దించారు. వారి వద్ద నుంచి భారత సబ్‌మెరైన్లు, ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్లు, యుద్ధనౌకల కదలికలు, రహస్య స్థావరాలు మరియు రక్షణ శాఖకు చెందిన అత్యంత సున్నితమైన సమాచారాన్ని దొంగిలించడానికి యత్నించారు.
Read Also : స్థానిక సంస్థల్లో బీసీలకు 34% కోటా.. సుప్రీంకోర్టులో గెలుస్తాం: రామ్మోహన్ నాయుడు
‘ఆపరేషన్ ఫైర్‌వాల్’తో ఏపీ పోలీసుల మెరుపు దాడి
ఈ వ్యూహాత్మక కుట్రపై పక్కా సమాచారం అందుకున్న ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’ పేరుతో ప్రత్యేక నిఘా చర్యలు చేపట్టింది. అత్యాధునిక సైబర్ క్రైమ్ సాంకేతికతను ఉపయోగించి డిజిటల్ నెట్‌వర్క్‌లను విశ్లేషించగా, ఈ కుట్ర వెనుక మొత్తం 13 మంది నేవీ సిబ్బందికి ప్రమేయం ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా ఆధారాలు సేకరించారు. సమయానుకూలంగా స్పందించి ఈ నెట్‌వర్క్‌ను ఛేదించడం ద్వారా దేశ రక్షణ రంగానికి సంబంధించి కీలకమైన రహస్యాలు శత్రుదేశం చేతుల్లోకి వెళ్లకుండా ఏపీ పోలీసులు అడ్డుకోగలిగారు. సున్నితమైన సమాచార భద్రత విషయంలో ఏపీ పోలీసులు చూపిన ప్రతిభ మరియు సమర్థతపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :