NTR Bharosa pension: దివ్యాంగులకు ఇంటి వద్దే పింఛన్ దరఖాస్తు సేవలు

Follow Us: Google News Daily Hunt
New Pensions
New Pensions
FONT SIZE
GET APP

NTR Bharosa pension:ఏపీలో కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే ప్రజలందరికీ ప్రభుత్వం మంచి అవకాశం కల్పించింది. ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద సెప్టెంబర్ ఏడో తేదీ నుంచి పదహారవ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుంది. వృద్ధులు మరియు వికలాంగులు ఎక్కడికీ వెళ్లకుండా నేరుగా సాయం పొందేలా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కార్యాలయాల చుట్టూ తిరిగే ఇబ్బందులు లేకుండా గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఈ ప్రక్రియ జరుగుతుంది. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. సచివాలయాల్లో తాగునీరు వంటి కనీస వసతులు కల్పించి ఎవరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. దరఖాస్తు సమయంలో ప్రజలు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా సులభంగా పూర్తి చేసేలా మార్గదర్శకాలు జారీ చేశారు.

Read also: AP Freehold Lands : ఫ్రీ హోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లకు లైన్ క్లియర్..అసలు ఫ్రీ హోల్డ్ భూములు అంటే ఏంటి ?

Application process for new pensions begins.
Application process for new pensions begins.

ఇంటివద్దకే వచ్చి దరఖాస్తులు నింపే ప్రత్యేక సేవలు

నెలవారీ పింఛన్ల కోసం దరఖాస్తు చేసే వృద్ధులకు అలాగే వికలాంగులకు ప్రభుత్వం పెద్ద ఊరట అందించింది. నడవలేని స్థితిలో ఉన్నవారు లేదా కార్యాలయాలకు రాలేని వారి కోసం వీవోఏలు మరియు వీవోవోబీలు నేరుగా ఇళ్లకు వెళ్తారు. వారి వద్ద నుంచి అవసరమైన వివరాలు సేకరించి దరఖాస్తులను ఆన్‌లైన్ లో నమోదు చేసే బాధ్యతను ఈ సిబ్బందికి అప్పగించారు. సెర్ప్ సీఈవో ఆదేశాల మేరకు అధికారులు అందరూ ఈ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన తర్వాత అర్హతలను పరిశీలించేందుకు స్పష్టమైన తేదీలను ప్రభుత్వం ప్రకటించింది. సెప్టెంబర్ పదిహేడో తేదీ నుంచి ఇరవి ఒక్కటో తేదీ వరకు కామన్ ఎలిజిబులిటీ పరిశీలన ఉంటుంది. ఆ తర్వాత మూడు రోజుల పాటు అర్హత పరిశీలన జరిగి చివరికి బడ్జెట్ కేటాయింపు ప్రక్రియ పూర్తవుతుంది.

NTR Bharosa pension:పింఛన్ పొందడానికి కావలసిన ముఖ్యమైన అర్హతలు

ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ప్రభుత్వం కొన్ని నిర్దిష్టమైన నిబంధనలను మరియు ఆదాయ పరిమితులను ఖరారు చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ నెలవారీ ఆదాయం పది వేల రూపాయల కంటే తక్కువగా ఉండాలి. పట్టణ ప్రాంతాల్లో అయితే ఈ పరిమితి పన్నె12 వేల రూపాయల లోపు ఉండాలని నిబంధన పెట్టింది. కుటుంబంలో ఎవరి పేరు పైనైనా ఫోర్ వీలర్ వాహనం ఉండకూడదు అలాగే ప్రభుత్వ ఉద్యోగి లేదా పింఛనుదారులు ఉండకూడదు. నెలవారీ విద్యుత్ వినియోగం మూడు వందల యూనిట్ల కంటే తక్కువగా ఉండాలని నిబంధన స్పష్టం చేసింది. కుటుంబంలో ఎవరూ కూడా ఆదాయపు పన్ను చెల్లించేవారు ఉండకూడదని అధికారులు వెల్లడించారు. ఆధార్ కార్డులోని వయస్సు వివరాల ఆధారంగా పరిశీలన చేసి అర్హులైన వారికి మాత్రమే పింఛన్ మంజూరు చేస్తారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Siva Prasad

రచయిత గురించి

Siva Prasad

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు