Murasu Cyclone: బంగాళాఖాతంలో ఏర్పడిన మురసు తుఫాన్ ప్రభావం ఆంధ్రప్రదేశ్ పై తీవ్రంగా చూపుతోంది. దీని కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అనకాపల్లి, ఏలూరు, ప్రకాశం, కృష్ణా, కోనసీమ, ఎన్టీఆర్, పల్నాడు, గుంటూరు మరియు బాపట్ల జిల్లాల్లోని అన్ని విద్యాసంస్థలకు అధికారులు నేడు సెలవు ప్రకటించారు.

ఎస్డీఎంఏ నివేదిక – భారీ వర్షాలు కురిసే జిల్లాల వివరాలు
రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (SDMA) వెల్లడించిన నివేదిక ప్రకారం, తుఫాన్ ప్రభావం అత్యధికంగా ఉండే అవకాశం ఉన్న కృష్ణా, గుంటూరు మరియు బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హెచ్చరించారు. ఈ ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచించారు.
Murasu Cyclone: మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్న ఇతర జిల్లాలు
భారీ వర్షాల అంచనాలతో పాటు కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం మరియు నెల్లూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రజలు, ప్రయాణికులు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని, ప్రభుత్వ యంత్రాంగం అన్ని రకాల సహాయక చర్యలకు సిద్ధంగా ఉందని అధికారులు తెలిపారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :