Sri Krishna Janmashtami: ప్రజలకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్

Follow Us: Google News Daily Hunt
Sri Krishna Janmashtami
Sri Krishna Janmashtami
FONT SIZE
GET APP

Sri Krishna Janmashtami: శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. లోకంలో పెరుగుతున్న అధర్మాన్ని అడ్డుకుని, ధర్మాన్ని రక్షించేందుకే శ్రీమహావిష్ణువు శ్రీకృష్ణుడిగా ఈ భువిపై అవతరించారని ఈ సందర్భంగా సీఎం పేర్కొన్నారు.

Read Also : Nara Lokesh: అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..  నారా లోకేశ్ కీలక ప్రకటన

Sri Krishna Janmashtami: ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు నిండాలి: సీఎం, మంత్రి

జగద్గురువైన శ్రీకృష్ణుని దివ్య ఆశీస్సులు ఎల్లవేళలా రాష్ట్ర ప్రజలపై ఉండాలని సీఎం చంద్రబాబు, ఆకాంక్షించారు. ఆ మురళీధరుని కృపతో ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు నిండాలని కోరుకుంటూ, ప్రజలంతా జన్మాష్టమి వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఈ భువిపై ధర్మ సంస్థాపన కోసం శ్రీకృష్ణ పరమాత్ముడు అవతరించిన దివ్య దినమే శ్రీకృష్ణ జన్మాష్టమి. ఈ పవిత్ర పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రజలందరికీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో అధర్మాన్ని రూపమాపి, ధర్మాన్ని నిలబెట్టేందుకు శ్రీకృష్ణ భగవానుడు చూపిన మార్గం అందరికీ ఆదర్శనీయమని ఆయన పేర్కొన్నారు.

పవిత్ర భగవద్గీత ఉపదేశం ద్వారా లోకానికి కర్తవ్య బోధ, ధర్మ మార్గం మరియు మహోన్నత జ్ఞానాన్ని ప్రసాదించిన పరమాత్మ నిత్య స్మరణీయుడని మంత్రి లోకేష్ కొనియాడారు. భక్తిశ్రద్ధలతో వాడవాడలా ఎంతో వైభవంగా జరిగే ఈ కృష్ణాష్టమి వేడుకలు ప్రజలందరిలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని, ఆనందాన్ని నింపాలని కోరుకున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు