Arnab Cyclone: ఏపీకి తుపాను ముప్పు.. కోస్తా తీరానికి అతి తీవ్ర హెచ్చరిక!

Follow Us: Google News Daily Hunt
andhra pradesh arnab cyclone severe warning
andhra pradesh arnab cyclone severe warning
FONT SIZE
GET APP

Arnab Cyclone: బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర వాయుగుండం ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాన్ని వణికిస్తోంది. ఇది రాగల 24 గంటల్లో ‘ఆర్నబ్’ తుపానుగా బలపడనుందని, ఆ తర్వాత మరింత ఉగ్రరూపం దాల్చి ‘అతి తీవ్ర తుపాను’గా రూపాంతరం చెందుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నెల 28వ తేదీన విశాఖపట్నం మరియు మచిలీపట్నం మధ్య (ముఖ్యంగా కాకినాడ సమీపంలోని యానాం వద్ద) ఈ తుపాను తీరం దాటే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర వ్యాప్తంగా రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి.

గంటకు 140 కి.మీ. వేగంతో ఈదురుగాలులు.. 1.5 మీటర్ల ఎత్తున అలలు

సోమవారం ఉదయం నుంచే తీర ప్రాంతాల్లో ఈదురుగాలుల తీవ్రత భారీగా పెరగనుంది. తొలుత గంటకు 80 నుండి 100 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులు, తుపాను బలకొనేకొద్దీ మంగళవారానికి ఏకంగా 140 కిలోమీటర్ల వేగాన్ని పుంజుకోనున్నాయి. తుపాను తీరం దాటే సమయంలో సముద్రంలో రాకాసి అలలు దాదాపు 1.5 మీటర్ల ఎత్తు వరకు ఎగసిపడే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, యానాం తీర ప్రాంత ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Read also: AP Power Employees: కరెంట్ ఉద్యోగులకు సెలవులు లేవు

Arnab Cyclone: ఉమ్మడి కోస్తా జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’.. కుంభవృష్టి కురిసే అవకాశం

ఈ తుపాను ధాటికి శ్రీకాకుళం నుంచి బాపట్ల వరకు గల ఉమ్మడి కోస్తా జిల్లాలు అన్నీ తీవ్ర ప్రభావానికి గురికానున్నాయి. ముఖ్యంగా అక్టోబర్ 27, 28 తేదీల్లో కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఏలూరు, విశాఖపట్నం, కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో పలుచోట్ల కుంభవృష్టి తరహా భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కోస్తా జిల్లాలన్నింటికీ వాతావరణ శాఖ ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ చేసింది.

పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు.. మత్స్యకారులకు కఠిన ఆంక్షలు

తీర ప్రాంతంలో వాతావరణం పూర్తిగా ఆందోళనకరంగా మారడంతో కోస్తా తీరంలోని అన్ని ప్రధాన పోర్టుల్లో ఒకటో నంబరు ప్రమాద హెచ్చరిక బోర్డులను ఎగురవేశారు. ఈ నెల 29 వరకు సముద్రం అత్యంత అల్లకల్లోలంగా ఉంటుందని, అలల ఉద్ధృతి ప్రమాదకర స్థాయిలో ఉంటుందని హెచ్చరికల కేంద్రం స్పష్టం చేసింది. ఇప్పటికే వేటకు వెళ్లిన మత్స్యకారులు తక్షణమే సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ సముద్రంలోకి వెళ్లవద్దని కఠిన ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ యంత్రాంగం ముందస్తు సహాయక చర్యల్లో పూర్తి స్థాయిలో నిమగ్నమైంది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Sharanya

రచయిత గురించి

Sharanya

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు