Accident in Minister Uttam Kumar Chonvoy in Garidepalle in Suryapet

మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డికి తప్పిన ప్రమాదం

హుజూర్‌నగర్‌: తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్వాయ్ శుక్రవారం ప్రమాదానికి గురైంది. ఉత్తమ్ తన నియోజకవర్గమైన హుజూర్ నగర్ నుంచి జాన్ పహాడ్ ఉర్సు ఉత్సవాలకు వెళ్తుండగా సూర్యాపేట మండల కేంద్రమైన గరిడేపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నిలబడి ఉండటం చూసి మంత్రి కారును ఆపమని డ్రైవర్ కు సూచించారు.

దీంతో డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో వెనుకాల ఉన్న 8 కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనతో కార్ల బానెట్లు దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదు. ఈ ప్రమాదం నుంచి మంత్రి ఉత్తమ్ సురక్షితంగా బయటపడటంతో కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ఊపిరి పిల్చుకున్నారు. దీంతో అక్కడ ఒక్కసారిగా ట్రాఫిక్ ఏర్పడింది. అనంతరం మంత్రి కారు వెళ్లిపోవటంతో పోలీసులు వచ్చి ట్రాఫిక్ ని క్లియర్ చేశారు.

image

కాగా, ఇటీవల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కారుకు కూడా పెను ప్రమాదం తప్పిన విషయం తెలిసిందే. ఆయన ప్రయాణిస్తున్న కారు రెండు టైర్లు ఒక్కసారిగా పేలిపోయాయి. దీంతో వాహనం అదుపుతప్పింది. అయితే వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ముప్పు తప్పింది. వరంగల్ నుంచి ఖమ్మం వైపు వెళ్తుండగా తిరుమలాయపాలెం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం తప్పడంతో సిబ్బంది వెంటనే ఆయన్ని మరో కారులో ఖమ్మంకు తరలించారు.

Related Posts
రేప్ కేసులో కాంగ్రెస్ ఎంపీ అరెస్ట్
MP Rakesh Rathore

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని సీతాపూర్ ఎంపీ, కాంగ్రెస్ నేత రాకేశ్ రాథోడ్ అత్యాచారం కేసులో అరెస్ట్ అయ్యారు. ఓ మహిళ తనపై నాలుగు సంవత్సరాలుగా పెళ్లి పేరుతో Read more

జ‌గ‌న్ మీద బుర‌ద జ‌ల్లుతున్నారంటూ మాజీ మంత్రి రోజా ఫైర్
roja

అబద్ధాలను అందంగా అల్లటంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి ఆస్కార్ అవార్డు ఇవ్వాలంటూ ఏపీ కాంగ్రెస్ చీఫ్ , వైస్ షర్మిల చేసిన కామెంట్స్ Read more

ట్రంప్‌, జెలెన్‌స్కీ భేటీలో వాడీవేడి చర్చ
ట్రంప్​తో వాగ్వాదం విచారకరమంటూ జెలెన్​స్కీ ట్వీట్

ఎలాంటి ఒప్పందం లేకుండానే వెళ్లిన జెలెన్‌స్కీ వాషింగ్ట‌న్ : అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్‌.. ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెన్‌స్కీ మ‌ధ్య.. వాషింగ్ట‌న్ డీసీలోని వైట్‌హౌజ్‌లో జ‌రిగిన భేటీ Read more

ప్రభుత్వ హాస్టల్లో హరీశ్ రావు కొత్త సంవత్సరం వేడుకలు
Harish Rao New Year Celebrations in Government Hostels

హైరదాబాద్‌: సిద్ధిపేట అర్బన్ మండలం తడకపల్లి బీసీ హాస్టల్లో న్యూ ఇయర్ వేడుకలలో మాజీ మంత్రి హరీశ్‌ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి భోజనం Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *