Harish Rao New Year Celebrations in Government Hostels

ప్రభుత్వ హాస్టల్లో హరీశ్ రావు కొత్త సంవత్సరం వేడుకలు

హైరదాబాద్‌: సిద్ధిపేట అర్బన్ మండలం తడకపల్లి బీసీ హాస్టల్లో న్యూ ఇయర్ వేడుకలలో మాజీ మంత్రి హరీశ్‌ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. నూతన సంవత్సర వేడుకలు విద్యార్థుల మధ్య జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. 6 నెలల నుండి కాస్మోటిక్ చార్జీలు రాకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నాయే అని తెలుసుకోవడానికి వచ్చాను అన్నారు. మీకు మెస్, కాస్మోటిక్ చార్జీలు రాకపోవడం బాధాకరం…. అసెంబ్లీ లో చెప్పిన మెనూ వేరే ఉంది హాస్టల్ లో వేరే ఉందన్నారు. విద్యార్థులు ధరించే దుస్తులు కూడా ఈ ప్రభుత్వం ఇవ్వడం లేదు అన్నారు.

మీకు సంబంధించిన సమస్యల పైన ప్రభుత్వంలో ఉన్న వారితో మాట్లాడి అమలు అయ్యేలా చేస్తాను..నూతన సంవత్సరం అంటే విందు వినోదాలు కాకుండా ఉండాలి అని హాస్టల్ విద్యార్థులకు అవసరమైనవి ఇవ్వాలి అని చెప్పడంతో కార్యకర్తలు అందరు ముందుకు రావడం సంతోషం అన్నారు. విద్యార్థులు డ్రగ్స్, అన్లైన్ గేమ్స్ బారిన పడకుండా ఉండాలి. మీరు మంచిగా చదువుకోని తల్లితండ్రుల గౌరవం కాపాడాలన్నారు. మిమ్మల్ని చెడు వ్యసనాల వైపు మళ్లించడానికి చాలా మంది చూస్తుంటారు మీరు వాటికి దూరంగా ఉండాలి… మీకు తెలిసిన వారు కూడా ఎదైనా మాదకద్రవ్యాలు తీసుకుంటున్నట్టు తెలిస్తే మీ సార్లకు చెప్పాలన్నారు.ఇటీవల ఆన్ లైన్ గేమ్ ఆడి ఇద్దరు కానిస్టేబుల్ లు ఆత్మహత్య చేసుకున్నారు. మీరు ఆన్ లైన్ గేమ్స్ బారిన పడకూడదు.. మన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ , అబ్దుల్ కలామ్ లాంటి వారు వీధి దీపాల కింద చదువుకోని పైకి వచ్చారు అన్నారు. మీరు ఫోన్ లో గేమ్స్ ఆడుకుంటూ మీ సమయాన్ని వృధా చేయకుండా ఉండాలి అని కోరుకుంటున్నా… 10 వ తరగతి విద్యార్థులు బాగా చదవండి… ఉజ్వల భవిష్యత్ పది నుండే ప్రారంభం అవుతుందన్నారు.

Related Posts
100 కోట్లకు పైగా చిట్టీల మోసం- పరారీలో నిందితుడు
100 కోట్లకు పైగా చిట్టీల మోసం- పరారీలో నిందితుడు

అనంతపురం జిల్లా యాడికి మండలం, చందన లక్ష్మీపల్లి గ్రామానికి చెందిన పుల్లయ్య 18 సంవత్సరాల క్రితం హైదరాబాద్‌కు వచ్చాడు. తొలుత కూలీగా పని చేసిన పుల్లయ్య, స్థానికంగా Read more

మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డికి తప్పిన ప్రమాదం
Accident in Minister Uttam Kumar Chonvoy in Garidepalle in Suryapet

హుజూర్‌నగర్‌: తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్వాయ్ శుక్రవారం ప్రమాదానికి గురైంది. ఉత్తమ్ తన నియోజకవర్గమైన హుజూర్ నగర్ నుంచి జాన్ పహాడ్ ఉర్సు ఉత్సవాలకు Read more

బండి సంజయ్‌పై మంత్రి సీతక్క ఆగ్రహం
bandi sithakka

కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇటీవల చేసిన "భారతదేశం టీం ఇండియా, కాంగ్రెస్ పాకిస్తాన్" అనే వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి సీతక్క తీవ్రంగా స్పందించారు. ఆయన మాటలు Read more

ఫిబ్రవరి 7 అసెంబ్లీ ప్రత్యేక సమావేశం..!
February 7 Assembly special meeting.

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం బీసీ కులగణన పై ఫోకస్ చేసింది. ఇప్పటికే కులగణన పూర్తి అయిన నేపథ్యంలో ఫిబ్రవరి 2న కులగణన సర్వే రిపోర్ట్‌ ను అధికారులు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *