పూణె బస్సులో యువతిపై లైంగికదాడి

పూణె బస్సులో యువతిపై లైంగికదాడి

మహారాష్ట్రలోని పూణెలో దారుణం జరిగింది. బస్టాండ్‌లో బస్సు కోసం వేచి చూస్తున్న యువతి (26)తో మాటలు కలిపిన ఓ వ్యక్తి ఆపై ఆమెను ఖాళీగా ఉన్న బస్సులోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మహారాష్ట్రలోని అతిపెద్ద బస్టాండ్‌లలో ఒకటైన స్వర్‌గేట్‌ బస్టాండ్‌లో మొన్న ఉదయం ఆరు గంటల సమయంలో జరిగిందీ ఘటన. బస్టాండ్‌కు 100 మీటర్ల దూరంలోనే పోలీస్ స్టేషన్ ఉండటం గమనార్హం.
పోలీసుల కథనం ప్రకారం..
బాధిత యువతి సతారా జిల్లాలోని తన స్వగ్రామం ఫల్టాన్ వెళ్లేందుకు బస్సు కోసం వేచి చూస్తోంది. ఆమె ఒంటిగా ఉన్న విషయాన్ని గమనించిన నిందితుడు ‘అక్కా’ అని సంబోధిస్తూ మాటలు కలిపాడు. ఆమె ఎక్కడికి వెళ్లేదీ తెలుసుకున్నాడు. ఆ గ్రామానికి వెళ్లే బస్సు ఇక్కడ ఆగదని, మరో చోట ఉందని చెప్పి బస్ స్టేషన్‌లో దూరంగా నిలిపి ఉంచిన బస్ వద్దకు తీసుకెళ్లాడు. అనంతరం బస్సు ఎక్కాలని చెప్పగా, బస్సులో లైట్లు ఆఫ్ చేసి ఉండటంతో ఆమె అనుమానించింది. అది గమనించిన నిందితుడు బస్సులో ప్రయాణికులు ఉన్నారని, నిద్ర పోతుండటంతో లైట్లు ఆఫ్ చేశారంటూ బలవంతంగా ఆమెను బస్సు ఎక్కించాడు. ఆపై తనూ ఎక్కి తలుపు వేసి లైంగికదాడికి పాల్పడ్డాడు.
పోలీస్ స్టేషన్‌ లో ఫిర్యాదు
ఆ తర్వాత బాధితురాలు తన ఊరు వెళ్లాల్సిన బస్సు ఎక్కింది. అదే బస్సులో తన స్నేహితురాలిని చూసి జరిగిన విషయం చెప్పింది. పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆమె చెప్పడంతో వెంటనే బస్సు దిగి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని జరిగిన దారుణాన్ని వివరించింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు బస్ స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి నిందితుడిని దత్తాత్రేయ రామదాస్ (36)గా గుర్తించారు. అతడిపై ఇప్పటికే పలు కేసులు ఉన్నాయని, 2019 నుంచి బెయిలుపై ఉన్నాడని పోలీసులు తెలిపారు. అతడిని పట్టుకునేందుకు 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు.
డిప్యూటీ సీఎం అజిత్ పవార్ స్పందన
ఈ ఘటనపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ స్పందించారు. ఇదొక దురదృష్టకర ఘటన అని, బాధాకరమని పేర్కొన్నారు. ఈ ఘటన సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ దృష్టికి వెళ్లడంతో నిందితుడిపై కఠిన చర్యలకు ఆదేశించారని తెలిపారు. వీలైనంత త్వరగా నిందితుడిని పట్టుకుంటామని పేర్కొన్నారు.
ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు
కాగా, ఈ ఘటనపై ప్రతిపక్షాలు తీవ్రంగా స్పందించాయి. రాష్ట్రంలో నేరాలను అదుపు చేయడంలో సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ విఫలమయ్యారని ఆరోపించాయి. ఈ ఘటన 2012లో ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటనను తలపించిందని మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ హర్షవర్ధన్ సప్కాల్ ఆవేదన వ్యక్తం చేశారు. మహారాష్ట్రలోని బీజేపీ సారథ్యంలోని కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచితాలు ఇస్తూ వారి భద్రతను గాలికి వదిలేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఈ ఘటనను నిరసిస్తూ శివసేన (యూబీటీ) నేత వసంత్ మోరే, ఇతర నాయకులు స్వర్‌గేట్ బస్ స్టేషన్‌కు చేరుకుని నిరసన తెలిపారు. కిటికీలను ధ్వంసం చేశారు.

Advertisements
Related Posts
ఢిల్లీ రాజకీయల్లో వేడి – అతిషికి రేఖా గుప్తా కౌంటర్
ఒక్కరోజు గడవకముందే విమర్శలు ఎందుకని రేఖా గుప్తా ఆగ్రహం

ఒక్కరోజు గడవకముందే విమర్శలు ఎందుకని రేఖా గుప్తా ఆగ్రహం ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, తమ ప్రభుత్వం ఏర్పాటు అయిన తొలి రోజే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోందని Read more

నేటి నుంచి పార్లమెంటు సమావేశాలు
Parliament sessions from today

న్యూఢిల్లీ: ఈరోజు ( సోమవారం )నుండి పార్లమెంట్‌ రెండో విడత బడ్జెట్‌ సమావేశాలు పునఃప్రారంభం కానున్నాయి. ఇవి ఏప్రిల్‌ 4వ తేదీ దాకా కొనసాగుతాయి. పలు శాఖలకు Read more

ప్రధాని మోదీ: రాజస్థాన్‌లో ప్రతి ఇంటికి నీటి సరఫరా
modi

ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం రాజస్థాన్‌లోని అన్ని ఇళ్లలో త్వరలోనే ప్రతి ఇంటికి నీటి సరఫరా అందించడానికి చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. కాంగ్రెసును నీటి వివాదాలు విషయంలో విమర్శిస్తూ, Read more

Supreme Court: జడ్జీల ఆస్తులపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
గవర్నర్‌కు వీటో అధికారాల్లేవ్: సుప్రీంకోర్టు

ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక బంగ్లాలో కరెన్సీ కట్టలు బయటపడిన వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు Read more

Advertisements
×