గవర్నర్‌కు వీటో అధికారాల్లేవ్: సుప్రీంకోర్టు

Supreme Court: జడ్జీల ఆస్తులపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక బంగ్లాలో కరెన్సీ కట్టలు బయటపడిన వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ఆస్తులపై సర్వోన్నత న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. న్యాయమూర్తుల తన ఆస్తుల వివరాలను వెల్లడించాలని, కోర్టు అధికారిక వెబ్‌సైట్‌లో వీటిని పొందుపరచాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఏప్రిల్ 1న జరిగిన సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సమావేశంలో చీఫ్ జస్టిస్ చేసిన ప్రతిపాదనలను ఏకగ్రీవంగా ఆమోదించారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం న్యాయమూర్తులు పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రధాన న్యాయమూర్తికి తమ ఆస్తుల వివరాలను అందజేయాల్సి ఉంటుంది.

Advertisements
Yజడ్జీల ఆస్తులపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

అలహాబాద్ హైకోర్టుకు జస్టిస్ వర్మ బదిలీ
జస్టిస్ వర్మను ఢిల్లీ హైకోర్టు నుంచి అలహాబాద్ హైకోర్టుకు బదిలీచేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులకు కేంద్ర ప్రభుత్వం గతవారం ఆమోదం తెలిపింది. జస్టిస్‌ వర్మ అధికారిక బంగ్లాలో మార్చి 14న హోలీ రోజు అగ్నిప్రమాదం చోటుచేసుకోగా.. అక్కడ స్టోర్‌రూమ్‌లో సగం కాలిన నోట్లకట్టలను అగ్నిమాపక సిబ్బంది గుర్తించారు. దీనికి సంబంధించిన వీడియో వెలుగులోకి రావడంతో తీవ్ర దుమారం రేగింది. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన సుప్రీంకోర్టు.. దీనిపై నివేదిక ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టును ఆదేశించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీకే ఉపాధ్యాయ్ ఇచ్చిన నివేదికను అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచిన సుప్రీంకోర్టు.. జస్టిస్ వర్మ నివాసంలోని కాలిన నోట్ల కట్టల వీడియోలు, ఫోటోలు కూడా అందులో పెట్టింది.
త్రిసభ్య కమిటీ అంతర్గత విచారణ
ఈ వ్యవహారంపై ఇప్పటికే సుప్రీం కొలీజియం నియమించిన త్రిసభ్య కమిటీ అంతర్గత విచారణ కొనసాగుతోంది. :కాగా, న్యాయవ్యవస్థ పారదర్శకంగా ఉండాలని కోరుకుంటోన్న సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా…. కొలీజియంలోని న్యాయమూర్తులతో సంప్రదించిన అనంతరం జస్టిస్ వర్మ వివాదంపై ఢిల్లీ హైకోర్టు సీజే అందించిన నివేదికను వెబ్‌సైట్‌లో ఉంచినట్టు విశ్వనీయ వర్గాలు పేర్కొన్నాయి.

Related Posts
మావోయిస్టు ప్రభావిత జిల్లాలసంఖ్య 126 నుంచి 38కి తగ్గింది-కేంద్రం
maoist 38 update

ప్రభుత్వం చేపట్టిన చర్యలలో కనెక్టివిటీకి అధిక ప్రాధాన్యత.దేశంలో ఎల్‌డబ్ల్యూఈ (లెఫ్ట్ వింగ్ ఎక్స్‌ట్రీమిజం) ప్రభావం గణనీయంగా తగ్గిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. గత ఆరేళ్లలో మావోయిస్టు ప్రభావిత Read more

Sovereign Bonds: రూ.1 లక్షకు రూ.3 లక్షలు ఇవ్వనున్న ఆర్బీఐ
Sovereign Bonds: రూ.1 లక్షకు రూ.3 లక్షలు ఇవ్వనున్న ఆర్బీఐ

ఎనిమిదేళ్ల క్రితం సావరిన్ గోల్డ్ బాండ్లలో పెట్టుబడులు పెట్టిన వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తీపి కబురు అందించింది. 2016-17 సిరీస్-4 బాండ్ల మెచ్యూరిటీ Read more

జెనీవా సమావేశంలో పాకిస్తాన్ వ్యాఖ్యలపై భారత్ తీవ్ర స్పందన
జెనీవా సమావేశంలో పాకిస్తాన్ వ్యాఖ్యలపై భారత్ తీవ్ర స్పందన

జెనీవాలో జరిగిన UN మానవ హక్కుల మండలి సమావేశంలో పాకిస్తాన్ జమ్మూ & కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తడం భారతదేశం తీవ్రంగా తప్పుబట్టింది. భారతదేశం ఈ ఆరోపణలకు దీటుగా Read more

Rajinikanth: సముద్రతీర ప్రాంత వాసులను హెచ్చరించిన సినీ నటుడు రజనీకాంత్
Rajinikanth: సముద్రతీర ప్రాంత వాసులను హెచ్చరించిన సినీ నటుడు రజనీకాంత్

సముద్ర మార్గం ద్వారా ఉగ్రవాదుల చొరబాట్లపై రజనీకాంత్ హెచ్చరిక సూపర్ స్టార్ రజనీకాంత్ తన అభిమానులకు, ప్రజలకు ఓ కీలక హెచ్చరిక చేశారు. ఉగ్రవాదులు సముద్ర మార్గం Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×