జిమ్‌లో గాయపడిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక తన తాజా ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆమె గాయపడిన నేపథ్యంలో ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. రష్మిక తన గాయంతో బాధపడుతున్నప్పటికీ, త్వరలోనే తిరిగి మీ ముందుకు వస్తానని , సినిమా షూటింగ్ లలో పాల్గొనబోతాను అని చెప్పడం అభిమానుల్లో ధైర్యం నింపింది.
ఈ గాయం కారణంగా, ఆమె కొంతకాలం విశ్రాంతి తీసుకోవాల్సి వస్తుందని రష్మిక స్వయంగా ప్రకటించారు. “కోలుకునేందుకు రోజులు, నెలలు పడుతాయేమో, దేవుడికే తెలుసు” అని ఆమె పోస్ట్‌లో పేర్కొన్నారు. అయితే, రష్మిక అభిమానులకు ధైర్యాన్ని ఇచ్చేందుకు, త్వరలోనే సికందర్ మరియు కుబేర సినిమాల్లోని సెట్స్‌పై అడుగుపెట్టాలని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. తనకు జరిగిన గాయం కారణంగా దర్శకులకు క్షమాపణలు తెలిపింది రష్మిక. గాయంతో బాధపడుతున్నప్పటికీ, యాక్షన్ సీన్లకు తిరిగి వెళ్ళడానికి ప్రయత్నిస్తానని ఆమె పోస్ట్‌లో తెలిపారు. ఇది ఆమె ప్రొఫెషనలిజాన్ని మరియు కష్టాలను ఎదుర్కొనే మనోబలాన్ని స్పష్టం చేస్తుంది.
రష్మిక మందన్న ఇటీవలే పుష్ప 2 సినిమాతో వచ్చి భారీ హిట్ కొట్టింది. ఈ సినిమాలో తన నటనతో, డ్యాన్సులతో ఇంప్రెస్ చేసింది. ఈ సినిమా 1830 కోట్లకు పైగా కలెక్ట్ చేసి బాహుబలి 2 రికార్డులను కూడా బద్దలు కొట్టింది. ఇక రష్మిక ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉంది. సౌత్, హిందీ సినిమాలతో దూసుకుపోతుంది. ప్రస్తుతం రష్మిక చేతిలో చావా, తామా, సికిందర్, కుబేర, ది గర్ల్ ఫ్రెండ్.. ఇలా అరడజను సినిమాలు ఉన్నాయి. ఇంత బిజీగా ఉన్న సమయంలో ఇలా జరిగి బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి రావడం కష్టమే.