Headlines
Anand Mahindra reacts to excessive working hours

అధిక పని గంటలపై స్పందించిన ఆనంద్ మహీంద్రా

న్యూఢిల్లీ : మార్కెట్‌లో పోటీని తట్టుకునేందుకు ఉద్యోగులు వారానికి 90 గంటలు, ఆదివారాల్లో కూడా పని చేయాలని ఎల్ అండ్ టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా తన ఆలోచనలను పంచుకున్నారు. తన ఉద్దేశంలో పని ఎంతసేపు చేశామన్నది కాదు.. చేసిన పనిలో ఎంత నాణ్యత ఉందనేది ముఖ్యమని అన్నారు. ఢిల్లీలో జరిగిన విక్షిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2025లో మాట్లాడిన మహీంద్రా… పనిలో క్వాంటిటీ లేకపోయినా క్వాలిటీ ఉండాలని చెప్పారు.

image
image

వారంలో 70 గంటలు, 90 గంటల పని చేయాలని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి, ఎల్ అండ్ టీ సుబ్రహ్మణ్యన్ చేసిన వాదనలపైనా ఆనంద్ మహీంద్రా స్పందించారు. తనకు నారాయణమూర్తి అన్నా, ఇతర కార్పొరేట్ దిగ్గజాలన్నా చాలా గౌరవం ఉందని, తన ఉద్దేశంలో ఎంతసేపు పనిచేశావన్నది ముఖ్యం కాదని, పనిలో నాణ్యత ముఖ్యమని చెప్పారు. వారంలో 48, 70 గంటలు, 90 గంటలు పనిచేయడం కంటే… క్వాలిటీ ఔట్ పుట్ పై దృష్టి సారించాలన్నారు. “నాణ్యమైన పని 10 గంటలు చేసినా చాలు… ప్రపంచాన్నే మార్చేయొచ్చు” అని ఆనంద్ మహీంద్రా వ్యాఖ్యానించారు. ఇక రోజూ ఎన్ని గంటలు పని చేస్తే బాగుంటుందన్న ప్రశ్నకు సమాధానమిచ్చిన ఆనంద్ మహీంద్రా.. రోజులో ఇన్ని గంటలే పనిచేయాలన్న టైమ్ కు సంబంధించిన విషయం పక్కన పెడితే.. కచ్చితంగా ఇన్ని గంటలు పనిచేయాలని తాను చెప్పనని, కానీ చేసే పనిలో నాణ్యత ఉండాలని సూచించారు.

ఆర్థికంగా అభివృద్ధి చెందిన చాలా దేశాలు వారానికి 4 రోజుల పని విధానాన్ని స్వీకరించాయని ఆనంద్ మహీంద్రా గుర్తు చేశారు. కుటుంబం కోసం ఒక కారును తయారు చేయాలంటే.. కార్యాలయాల్లో దాని గురించి చర్చిస్తే సరిపోదనీ.. తమ కుటుంబంలో ఎలాంటి కారును కోరుకుంటున్నారో తెలుసుకోవడం చాలా ముఖ్యమని మహీంద్రా అన్నారు. కిటికీలు తెరిచి గాలిని లోపలికి రానివ్వండి అన్న గాంధీజీ మాటలను ఆయన గుర్తుచేశారు. ఉద్యోగులు వారానికి 90 గంటలు పనిచేయాలంటూ ఎల్‌అండ్‌టీ చైర్మన్ సుబ్రహణ్మన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు నెట్టింట దుమారం రేపాయి. ఉద్యోగులు ఆదివారాలు కూడా పని చేయాలని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. ‘‘మీతో ఆదివారాలు కూడా పని చేయించలేకపోతున్నందుకు నాకు విచారంగా ఉంది. ఎందుకంటే నేను ఆదివారాలు కూడా పని చేస్తాను’’ అని ఆయన కామెంట్ చేశారు. అంతకుముందు భారత దేశ యువత వారానికి 70 గంటలు పనిచేయాలన్న ఇన్ఫోసిస్ నారాయణమూర్తి సూచన సైతం దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Click here to get the fox news app. Advantages of local domestic helper. Dprd kota batam.