Headlines
Attacks at the instigation of CM Revanth Reddy: MLC Kavitha

సీఎం ప్రోద్భలంతోనే దాడులు : ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్‌: యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం పై NSUI, కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేయడాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కల్వకుంట్ల కవిత ఖండించారు. కాంగ్రెస్ పార్టీ డీఎన్ఏ లోనే ద్వేషం, హింస, విధ్వంసం ఉందని కవిత మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రోద్భలంతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ గూండాలు రెచ్చిపోతున్నారని విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా ఎదుర్కోలేక కాంగ్రెస్ నాయకులు ఇలాంటి హింసాత్మక చర్యలకు పాల్పడటం దుర్మార్గమని స్పష్టం చేశారు. ఈ దాడిని పిరికిపంద చర్యగా అభివర్ణించారు.

image
image

రాహుల్ గాంధీ వల్లించే మొహభృత్ కి దుకాన్ ఒక బూటకమని తేటతెల్లమైందని.. అది విద్వేషం, హింసను ప్రేరేపించే దుకాణమని కవిత ధ్వజమెత్తారు. ఇలాంటి హింసా రాజకీయాలను తెలంగాణ తిరస్కరిస్తుందని, హింసకు రాజకీయాలను తెలంగాణ తిరస్కరిస్తుందని, హింసకు విధ్వంసకర చర్యలకు తెలంగాణలో తావు లేదని తెలిపారు. కాంగ్రెస్ తన యువజన విభాగాన్ని గూండాల విభాగంగా తీర్చిదిద్దుతోందని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ కార్యక‌ర్తలు, నాయ‌కుల జోలికి వ‌స్తే ఊరుకోబోమ‌ని హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై దాడి చేసిన కాంగ్రెస్ మూకలపై క‌ఠిన చ‌ర్యలు తీసుకోవాల‌ని, వెంట‌నే అరెస్టు చేయాల‌ని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Flooding kills dozens in afghanistan – mjm news. For details, please refer to the insurance policy. Rapat paripurna dprd kota batam, pemerintah kota batam ajukan 8 poin ranperda.