Headlines
charan food

అభిమానులకు భోజనం ఏర్పాటు చేసిన రామ్ చరణ్

గేమ్ ఛేంజర్ విడుదల సందర్భంగా హీరో రామ్ చరణ్ అభిమానుల కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. సినిమా విడుదల తర్వాత ఆయనకు శుభాకాంక్షలు తెలిపేందుకు హైదరాబాద్‌లోని తన నివాసానికి పెద్ద సంఖ్యలో అభిమానులు చేరుకున్నారు. వారందరికీ రామ్ చరణ్ మధ్యాహ్న భోజనాలు ఏర్పాటు చేసి తన అభిమానులకు ప్రేమను వ్యక్తం చేశారు. రామ్ చరణ్ అభిమానులకు ఇచ్చిన ఈ అద్భుత గిఫ్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భోజన కార్యక్రమానికి అభిమానులు సంతోషంతో హాజరయ్యారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ రామ్ చరణ్ మంచి మనసును బయటపెడుతున్నాయి.

ఈ సందర్భంగా రామ్ చరణ్ అభిమానులతో సమయం గడిపారు. వారితో సెల్ఫీలు దిగుతూ, వారి ప్రేమకు కృతజ్ఞతలు తెలిపారు. “మీ అభిమానమే నా విజయం, మీరిలా మా పట్ల చూపిస్తున్న ప్రేమ మా కెరీర్‌కు పెద్ద బలం” అని చెర్రీ అభిప్రాయపడ్డారు. ఫ్యాన్స్‌కి చెర్రీ చేసిన ఈ భోజన విందు అభిమానులను ఆకట్టుకుంది. రామ్ చరణ్‌ను మనస్ఫూర్తిగా ప్రశంసిస్తూ, అతని కెరీర్‌లో మరిన్ని విజయాలు రావాలని ఆకాంక్షించారు. “చరణ్ వంటి హీరోలు మాత్రమే తమ అభిమానులను ఇలా గౌరవిస్తారు” అని పలువురు అభిమానులు అన్నారు. రామ్ చరణ్ అభిమానులపై చూపించిన ఈ గౌరవం, ఆయన మనసున్న మనిషి అని మరోసారి రుజువు చేసింది. పెద్ద హీరోగా ఎదిగినా, అభిమానులతో ఈ విధంగా సమయాన్ని గడపడం చూసి ప్రేక్షకులు, అభిమానులు చరణ్‌ను తెగ ప్రశంసిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Ham radio antenna switches x 4. Fdh visa extension. Were.