ఐశ్వర్య రాజేష్ ఈ పేరు సినీప్రేమికులకు కొత్త కాదు.దాదాపు 13 ఏళ్లకు పైగా సినీ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసింది.చిన్నప్పుడే చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ,ఇప్పుడు హీరోయిన్గా దూసుకెళ్తోంది. తెలుగు, తమిళ్ సినిమాల్లో నటిస్తూ, హిందీ చిత్రాల్లో కూడా మెరిసింది. అయితే, తమిళ్ సినిమాల్లోనే ఎక్కువగా కనిపిస్తూ అక్కడ మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో చేసిన సినిమాలు అంతగా విజయం సాధించకపోవడంతో ఆఫర్లు తగ్గాయి.కానీ ఇప్పుడు ఐశ్వర్య కొత్త ఊపు తెచ్చుకుంది. సంక్రాంతి కానుకగా వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో ముఖ్యమైన పాత్రలో కనిపించబోతోంది. ఇందులో వెంకటేశ్ భార్యగా ఐశ్వర్య రాజేష్ నటించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది.
ఈ సినిమాపై ఐశ్వర్య పెద్ద ఆశలు పెట్టుకుంది. ఎందుకంటే, అనిల్ రావిపూడి, వెంకటేశ్ కాంబినేషన్ ఇప్పటికే ఎఫ్2, ఎఫ్3 సినిమాలతో బ్లాక్‌బస్టర్ విజయాలు అందుకుంది. ఈ సారి కూడా అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందని ప్రేక్షకులు నమ్ముతున్నారు.ఈ సందర్భంగా ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ, స్క్రిప్ట్ నరేషన్ విన్నప్పుడే నవ్వులు ఆగలేకపోయాను. నా కెరీర్‌లో ఇంతగా ఎంజాయ్ చేస్తూ విన్న స్క్రిప్ట్ ఇదే.’భాగ్యం’ పాత్ర కోసం చాలా ఆలోచించారు.
ఆ పాత్ర నాకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నాను అని చెప్పింది.ఈ సినిమా విజయవంతం అయితే, తెలుగు సినీ పరిశ్రమలో ఐశ్వర్యకు మరిన్ని అవకాశాలు దక్కడం ఖాయం.గతంలో కంటే ఈసారి ఆమె పూర్తిగా కొత్త ఊహలతో ప్రేక్షకులను ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తోంది.ఐశ్వర్య నటన, వెంకటేశ్ కామెడీ టైమింగ్, అనిల్ రావిపూడి దర్శకత్వం. ఈ మూడింటి కలయిక సంక్రాంతి బరిలో ఎంత దుమ్ము రేపుతుందో చూడాలి! తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాపై భారీగా ఆసక్తి చూపిస్తున్నారు. ఐశ్వర్యకు ఇది మైలురాయి కావాలని సినీప్రేమికులు ఆశిస్తున్నారు. సంక్రాంతికి ఈ సినిమా ఎంతటి సక్సెస్ సాధిస్తుందో వేచి చూడాల్సిందే!