Headlines
kodi pandalu

భారీగా కోడి పందేల ఏర్పాట్లు

సంక్రాంతి పండుగ సీజన్ వస్తే చాలు ఆంధ్రప్రదేశ్ లో కోడి పందేల జోరు కొనసాగుతుంది. కోట్లాది రూపాయలు ఈ పందేరంలో పెడతారు. సంక్రాంతి పండుగ వేళ కోడి పందేల నిర్వహణకు హైటెక్‌ హంగులతో సిద్ధమవుతున్నాయి. బాపులపాడు మండలం అంపాపురంలో 12 ఎకరాల వెం చర్‌లో భారీగా ఏర్పాట్లు జరుగు తున్నాయి. ఎల్‌ఈడీ తెరలు, విద్యుత్‌ దీపాలు, వీఐపీల కోసం ప్రత్యేకంగా గ్యాలరీలను రెడీ చేస్తున్నారు. రికార్డు స్థాయిలో పందేల నిర్వహణకు పక్కా ప్రణాళిక సిద్ధం చేశారు. ఇప్ప టికే పందెం రాయుళ్లు హను మాన్‌జంక్షన్‌లో హోటల్‌ రూమ్‌ లను బుక్‌ చేసుకున్నారు. ఈ ఏడాది కోట్ల రూపాయలు చేతులు మారనున్నాయి.


సంక్రాంతి కోడి పందేలకు హైటెక్‌ హంగులతో బరులు రెడీ అవుతున్నాయి. ఒక వైపు అధికారులు ఊరుకునేది లేదంటూ హెచ్చరిస్తు న్నా.. మరో వైపు నిర్వాహకులు ఉరిమే ఉత్సాహంతో చకచకా బరులను సిద్ధం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రా ల్లో పేరిన్నికగన్న బాపులపాడు మండలం అంపాపురం ప్రధాన బరి కాగా, కె.సీతారాంపురం, బిళ్లనపల్లి గ్రామాల్లో చిన్నపాటి బరులను సిద్ధం చేస్తున్నారు. విజయవాడ రూరల్‌ మండలం అంబాపురం, జక్కంపూడిలో పందేలకు ఏర్పాట్లు చేస్తున్నారు. జాతీయ రహదారి పక్కనే ఉన్న 12 ఎకరాల వెంచర్‌లో ఏర్పాటు చేస్తున్న బాపులపాడు మండలం అంపాపురం బరికి హైటెక్‌ హంగులతో సొబగులద్దుతున్నారు. పేకాట, గుండాట, కోసుల నిర్వహణ, బిర్యానీ పాయిం ట్ల ఏర్పాట్లకు పనులు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగకు కోడిపందేల బరితో ప్రత్యేకత చాటుకుంటున్న అంపాపురం మరోసారి రూ.కోట్లలో పందేలు నిర్వహించేందుకు సన్నద్ధమ వుతోంది. పండగ మూడు రోజులు గతంలో జరిగినట్లే భారీగా పందేలు నిర్వహించడంతో పాటు విజేతలకు భారీ నజరానాలు, బహుమతులు ఇచ్చేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్టు నిర్వాహకులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Flooding kills dozens in afghanistan – mjm news. Advantages of local domestic helper. Gelar rapat paripurna, ini 10 rancangan randerda inisiatif dprd kota batam.