Headlines
chandra babu

20 లక్షల మందికి ఉపాధి: చంద్రబాబు

తమ ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అంతేకాక కొత్త ఏడాదిలో రాష్ట్రంలో నిర్మాణ రంగం వేగంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నానని చంద్రబాబు ఆకాంక్షించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్మాణ రంగం అధ్వానంగా మారిందని అన్నారు. తమను నమ్మిన ప్రజలు 93 శాతం స్ట్రైక్ రేట్ తో విజయాన్ని అందించారని… కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్ర పునర్నిర్మాణాన్ని ప్రారంభించామని చెప్పారు. గుంటూరులోని చేబ్రోలు హనుమయ్య మైదానంలో నిర్వహిస్తున్న నరెడ్కో ప్రాపర్టీ షోను చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.


భూ సమస్యలకు సంబంధించి గతంలో ఎన్నడూ చూడని విధంగా దరఖాస్తులు వస్తున్నాయని ముఖ్యమంత్రి చెప్పారు. భూ కబ్జాదారులపై ఉక్కుపాదం మోపుతామని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ. 4 లక్షల కోట్ల పెట్టుబడులకు సంతకాలు చేశామని చెప్పారు. ఐదేళ్లలో 20 లక్షల మందికి ఉపాధి కల్పించాలనేదే తమ లక్ష్యమని అన్నారు.
ప్రధాని మోదీ విశాఖకు వచ్చి రూ. 2 లక్షల కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారని చంద్రబాబు తెలిపారు. నిర్మాణ రంగంపై 34 లక్షల మంది ఆధారపడి ఉన్నారని చెప్పారు. ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చి నిర్మాణ రంగానికి ఊతమిచ్చామని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

City officials in thailand’s capital bangkok were ordered on thursday to work from home for two days. Basic implements by domestic helper | 健樂護理有限公司 kl home care ltd. Peringati hari kartini, bp batam gelar senam pound fit di taman kolam sekupang.