Headlines
ktr acb

రేవంత్ రెడ్డి మాదిరి లుచ్చా పనులు చేయలేదు – కేటీఆర్

తెలంగాణ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అవినీతి నిరోధక విభాగం (ఏసీబీ) విచారణ కోసం తన నివాసం నుంచి కార్యాలయానికి బయలుదేరారు. తన ఇంటికి వచ్చిన పార్టీ నేతలతో సమావేశమైన అనంతరం, మీడియాతో మాట్లాడి తన లాయర్ రామచంద్రరావుతో కలిసి వెళ్లారు. ఈ సందర్భంగా కేటీఆర్ తనపై వచ్చిన ఆరోపణలపై ఘాటుగా స్పందించారు.

కేసీఆర్ సైనికుడిగా, తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన కార్యకర్తగా తెలంగాణ ప్రతిష్ఠ పెంచడానికి నా కృషి ఏమాత్రం తక్కువ కాదు, హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో నిలిపేందుకు ఫార్ములా ఈ-కార్ రేసుల వంటి కార్యక్రమాలు చేపట్టాం. కానీ నేను అవినీతికి సంబంధించిన ఏ తప్పు చేయలేదని స్పష్టంగా చెబుతున్నా. కాంగ్రెస్ బురద చల్లే రాజకీయాలు చేస్తోంది. ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న అని చెప్పి నాపై కేసులు పెట్టి, డైవర్షన్ పాలిటిక్స్ చేయాలనుకుంటోంది. కానీ నేను న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉన్న..న్యాయమే గెలుస్తుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేసారు.

కేటీఆర్ రేవంత్ రెడ్డీపై వ్యక్తిగతంగా తీవ్ర ఆరోపణలు చేస్తూ “నీలాగా లుచ్చా పనులు, తుచ్చ పనులు చేయను. నేను క్విడ్ ప్రోకో చేయలేదు. మీలాంటి అడ్డంగా దొరికిపోయిన దొంగను కాను. కేసీఆర్ కొడుకుగా నేను నిజాయితీకి కట్టుబడి ఉంటాను. తెలంగాణ కోసం అవసరమైతే చనిపోవడానికి సిద్ధం” అన్నారు. “నా మీద ఎన్ని కేసులు పెట్టినా నేను భయపడను. న్యాయపరంగా అన్నింటికీ సిద్ధంగా ఉన్నా. తెలంగాణ ప్రజలు మా పక్షాన ఉంటారని నాకు నమ్మకం ఉంది. నా కృషి తెలంగాణ భవిష్యత్తుకు భరోసా కలిగించేలా ఉంటుంది” అంటూ తన దృఢత్వాన్ని చాటుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Free ad network. Get free genuine backlinks from 2m+ great website articles. Direct hire fdh.