Headlines
The details of the deceased

తిరుపతిలో తొక్కిసలాట.. మృతుల వివరాలు

తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రాల వద్ద బుధువారం జరిగిన తొక్కిసలాట ఘటనా అందర్నీ దిగ్బ్రాంతికి గురిచేసింది. స్వామి దర్శనానికి భారీగా భక్తులు తరలివచ్చిన కారణంగా గందరగోళం చోటుచేసుకొని తొక్కిసలాటకు దారితీసింది. ఈ ఘటనలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు.

ఈ దుర్ఘటనలో నర్సీపట్నానికి చెందిన నాయుడుబాబు (51), విశాఖకు చెందిన రజిని (47), లావణ్య (40), శాంతి (34), కర్ణాటకలోని బళ్లారికి చెందిన నిర్మల (50), తమిళనాడులోని సేలం ప్రాంతానికి చెందిన మల్లిగ (49) మృతి చెందారు. ఈ మృతుల కుటుంబాలు తీవ్ర దుఃఖంలో మునిగిపోయాయి. ఈ తొక్కిసలాటలో మరో 40 మంది భక్తులు గాయపడ్డారు. వారిని వెంటనే తిరుపతి గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రులలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అధికారులు పరిస్థితిని పర్యవేక్షించి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఈ ఘటనకు గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. భక్తుల అధిక సంఖ్య, నిర్వాహకుల వైఫల్యం, సరైన భద్రతా చర్యల లేకపోవడం వంటి అంశాలు ప్రాథమికంగా వెల్లడయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This meatloaf recipe makes the best leftovers. Direct hire fdh. Sekupang kota batam sedangkan pelaku f dan r diamankan di spbu paradis batu aji kota batam.