న్యూఢిల్లీ :
పార్లమెంట్ ఆవరణలో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ ఎంపీల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో తమపై దాడికి పాల్పడ్డారంటూ లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదైంది. రాహుల్ గాంధీ తనను నెట్టారని బీజేపీ ఎంపీ ప్రతాప్ సారంగి అన్నారు. తాను మెట్లపై పడ్డానని ప్రతాప్ తెలిపారు. గాయపడిన సారంగిని పార్లమెంటు భద్రతా సిబ్బంది అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు.
మరోవైపు పార్లమెంట్ ఆవరణలో జరిగిన ఘటనపై రాహుల్ గాంధీ స్పందించారు. పార్లమెంట్ ఆవరణలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పార్లమెంట్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారని అన్నారు. అయితే బీజేపీ ఎంపీలు తనను లోపలికి రానీయకుండా అడ్డుకున్నారని తెలిపారు. ఆ ప్రక్రియలో తనను నెట్టివేశారని రాహుల్ పేర్కొన్నారు.