దళితుడి ఇంట్లో రాహుల్ భోజనం

దళితుడి ఇంట్లో రాహుల్ వంట చేయడమే కాదు వారితో పాటు కూర్చొని భోజనం చేసి వార్తల్లో నిలిచారు.
మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. జాతీయ పార్టీల అగ్రనేతల చూపు మొత్తం ప్రస్తుతం ఆ రాష్ట్రంపైనే పడింది. ఇటీవలె ప్రధాని సహా బీజేపీ అగ్రనేతలు మహారాష్ట్రలో పర్యటించగా.. తాజాగా రాహుల్ గాంధీ మహారాష్ట్రకు వెళ్లారు.

ఈ సందర్భంగా కొల్హాపూర్‌లోని ఓ దళిత కుటుంబంతో కొద్దిసేపు గడిపారు. దళితుడి ఇంటికి వెళ్లిన రాహుల్ గాంధీ.. ఆ కుటుంబంతో కలిసి వంట చేశారు. ఈ సందర్భంగా వారితో పలు విషయాలు మాట్లాడారు. వంట చేయడం పూర్తి అయిన తర్వాత ఆ దళితుడి కుటుంబంతో కలిసి రాహుల్‌ గాంధీ భోజనం చేసి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *