వైకాపాను వీడిన రాజ్యసభ ఎంపీ లపై ఆ పార్టీ అధ్యక్షడు జగన్ స్పందించారు.వైసీపీకి, రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా చేయడం రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై సీఎం జగన్ ఈరోజు స్పందిస్తూ బయటకు వెళ్లే ప్రతి రాజ్యసభ సభ్యుడికి విశ్వసనీయత ఉండాలని జగన్ అన్నారు. ప్రలోభాలకు లొంగో, భయపడో లేదా రాజీపడో వెళ్లిపోతే ఎలాగని ప్రశ్నించారు.ఇంకా ఒకరో ఆరో వెళ్లిపోయేవాళ్ళుంటే వాళ్ళకైనా అంతేనని వాఖ్యానించారు. రాజకీయాల్లో కష్టాలు ఉంటాయని ఐదేళ్లు కష్టపడితే మన సమయం వస్తుందని అన్నారు. విజయసాయిరెడ్డికైనా, మరెవరికైనా విశ్వసనీయత ముఖ్యమని చెప్పారు.

వైకాపా నేడు ఇలా ఉందంటే అది నాయకుల వల్ల కాదని చెప్పారు.అసెంబ్లీ సమావేశాలను తాము బహిష్కరించలేదని జగన్ అన్నారు. శాసనసభ సమావేశాలకు హాజరయ్యే విషయంలో కోర్టుకు కూడా వెళ్లామని తెలిపారు. అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరుపై వాళ్లు ఏం చేసుకున్నా వాళ్ల ఇష్టమని అన్నారు. ఎదురెదురుగా ఉండి కొట్టుకోవడం ఎందుకని అన్నారు. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోవడంపై కోర్టుకు అసెంబ్లీ స్పీకర్ సమాధానం చెప్పాలని డిమండ్ చేశారు. లిక్కర్ వ్యవహారంతో మిథున్ రెడ్డికి ఏం సంబంధం? అని జగన్ ప్రశ్నించారు. మిథున్ తండ్రి పెద్దిరెడ్డి ఏ శాఖకు మంత్రి? ఆయనకు లిక్కర్ కు ఏం సంబంధమని అడిగారు. ఎవరినో ఒకరిని ఇరికించడం, కేసు పెట్టడం వాళ్లకు అలవాటేనని విమర్శించారు.