అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుపరుస్తున్నారు . హామీలలోని భాగంగా అమెరికా నుండి భారత్ కు బుధవారం మధ్యాహ్నం వచ్చిన వలసదారుల్లో 33 చొప్పున గుజరాత్, హర్యానావాసులు ఉండగా.. తర్వాత 30 మంది పంజాబ్‌కు చెందినవారే అధికంగా ఉన్నారు. ముగ్గురు మహారాష్ట్ర, ఇద్దరేసి ఛండీగఢ్, ఉత్తర్ ప్రదేశ్‌లకు చెందినవారు. ఇక, 25 మహిళలు, 12 మంది చిన్నారులు వీరిలో ఉండగా.. నాలుగేళ్లు బాలుడు ఒకరు. అలాగే,, 48 మంది 25 ఏళ్లలోపువారే కాగా.. ఈ విమానంలో 11 మంది క్రూ సిబ్బంది, 45 మంది అమెరికా అధికారులు కూడా ఉన్నారు.అమెరికా సైనిక విమానం సీ-17 గ్లోబ్‌మాస్టర్‌లో వీరిని తరలించారు.అమెరికాలో అక్రమంగా నివసిస్తోన్న భారతీయుల తరలింపులో భాగంగా తొలి విడతలో 104 మంది బృందం బుధవారం మధ్యాహ్నం అమృత్‌సర్‌కు చేరుకుంది. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాకు చెందిన 36 ఏళ్ల జస్పాల్ సింగ్ మాట్లాడుతూ.. తమను చిత్రహింసలకు గురిచేశారని, కాళ్లకు సంకెళ్లు వేసి తీసుకొచ్చారని ఆరోపించారు. అమృత్‌సర్ ఎయిర్‌పోర్ట్‌లో దిగిన తర్వాత వాటిని తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు.

బుధవారం రాత్రి స్వగ్రామానికి చేరుకున్న జస్పాల్.. ట్రావెల్ ఏజెంట్ చట్టపరమైన మార్గాల ద్వారా అమెరికాకు పంపిస్తానని చెప్పి మోసం చేశాడని తెలిపారు. సరైన వీసాతో పంపమని తాను ఏజెంట్‌ను కోరితే.. అతడు ద్రోహం చేశాడన్నారు. రూ. 33 లక్షలకు డీల్ కుదుర్చుకుని మోసపోయానని జస్పాల్ వాపోయాడు.గత ఏడాది జూలైలో భారత్ నుంచి విమానంలో బ్రెజిల్ చేరుకున్న తనకు… అమెరికా పర్యటన కూడా విమానంలోనే ఉంటుందని హామీ ఇచ్చారు. కానీ, ఏజెంట్ మోసం చేసి అక్రమంగా అమెరికా సరిహద్దులు దాటించారని ఆరోపించారు.