bengaluru

బెంగళూరులో పొడవైన యూ-గర్డర్ ఆవిష్కరణ!

దేశంలోనే అతిపొడవైన యూ-గర్డర్ (సిమెంట్ దూలం)ను బెంగళూరులోని సబర్బన్ రైల్ కారిడార్‌లో ఉపయోగించారు. బెంగళూరు సబర్బన్ రైల్వే ప్రాజెక్టులో భాగంగా 31 మీటర్ల పొడవైన ఈ గర్డర్‌ను ఈ ఏడాది జనవరిలో గొల్లహళ్లిలో ఒకే విడతలో ప్రీకాస్ట్ చేయడం విశేషం. బైయప్పనళ్లి-చిక్కబనవర లైన్‌లో యశ్వంతపూర్‌లో గత రాత్రి 9.45-10 గంటల మధ్య ఆవిష్కరించినట్టు ‘కే-రైడ్’ (కర్ణాటక రైల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కంపెనీ లిమిటెడ్) అధికారులు తెలిపారు.
యూ’ ఆకారంలో గర్డర్‌
‘యూ’ ఆకారంలో ఉన్న ఈ గర్డర్‌లను రైల్వే ఆధారిత ప్రజారవాణా ప్రాజెక్టులలో ఉపయోగిస్తుంటారు. హెబ్బాల్-యశ్వంతపూర్ మధ్య మల్లిగే లైన్ 8 కిలోమీటర్ల ఎలివేటెడ్ సెక్షన్‌లో 450 యూ-గర్డర్‌లు ఉపయోగిస్తున్నారు. గొల్లహళ్లి వద్ద ఇప్పటికే 60 యూ గర్డర్లు వేశారు. కాగా, మల్లిగే లైన్‌ను డిసెంబర్ 2026 నాటికి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఇవి నాణ్యంగా ఉండటంతోపాటు నిర్మాణ సమయాన్ని ఆదా చేస్తాయి. మెట్రో ప్రాజెక్టుల్లో ఇప్పటి వరకు గరిష్ఠంగా 28 మీటర్ల యూ గర్డర్లను మాత్రమే ఉపయోగించారు. యూ గర్డర్‌కు 69.5 క్యూబిక్ మీటర్ల ఎం60 గ్రేడ్ కాంక్రీట్ అవసరం అవుతుంది. బరువు ఏకంగా 178 టన్నులు ఉంటుంది.

Advertisements

Related Posts
భారత్‌పై ట్రంప్ ఒత్తిడి
ఏప్రిల్ 2 నుండి పరస్పర సుంకాల అమలు

భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మధ్య ఫోన్‌ సంభాషణ జరిగింది. ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతం సహా అనేక అంశాలపై Read more

ట్రాక్టర్లు ఢీకొన్న ట్రక్.. 10 మంది కూలీల దుర్మరణం
ట్రాక్టర్లు ఢీకొన్న ట్రక్.. 10 మంది కూలీల దుర్మరణం

ఉత్తరప్రదేశ్ లో శుక్రవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. మీర్జాపూర్లో వేగంగా వెళ్తున్న ట్రక్కు కూలీలను తీసుకెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీని బలంగా ఢీకొంది. దీంతో 10 మంది Read more

గెలుపు దిశ గా బీజేపీ!

గెలుపు దిశ గా బీజేపీ.ప్రస్తుతం ఫలితాలు చూస్తే బీజేపీ అధికారంలోకి రావడం పక్కా అనే సంకేతాలు వెలువడుతున్నాయి. 70 శాసనసభ స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీలో 36 స్థానాల Read more

US layoffs : అమెరికాలో ఉద్యోగ మాంద్యం .. మనోళ్లపై ప్రభావం
US layoffs అమెరికాలో ఉద్యోగ మాంద్యం మనోళ్లపై ప్రభావం

US layoffs : అమెరికాలో ఉద్యోగ మాంద్యం .. మనోళ్లపై ప్రభావం అమెరికాలో ఉద్యోగాలు కోల్పోయిన ఎన్నారైలు భారత్‌కి వచ్చాక సరైన అవకాశాలు దొరకడం లేదు. భారతీయ Read more

×