virus

పొంచి వున్న మరో వైరస్ ముప్పు?

ఆస్ట్రేలియా, డిసెంబర్ 12,
చైనా ల్యాబ్ నుంచి కరోనా వైరస్ వ్యాప్తి చెందినదని అన్ని దేశాలు ఆరోపించాయి. ఈ కరోనా వైరస్ నుంచి ప్రపంచం ఇంకా కోలుకోకుండానె కొత్త వైరస్ లు పుట్టుకొస్తున్నాయి. తాజాగా ప్రాణాంతక సజీవ వైరస్‌ నమూనాలు ఉన్న వందలాది వయల్స్ (చిన్న బాటిల్స్) ల్యాబ్ నుంచి అదృశ్యమైనట్టు ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్ ప్రభుత్వం ప్రకటించింది. వయల్స్ మాయం ఘటన కలకలం రేపడంతో ఆస్ట్రేలియా ప్రజారోగ్య విభాగంతోపాటు క్వీన్స్‌లాండ్ హెల్త్ శాఖ సంయుక్తంగా దర్యాప్తునకు ఆదేశించాయి. ఈ ఘటనను అతిపెద్ద బయోసెక్యూరిటీ ప్రొటోకాల్స్ ఉల్లంఘనగా ప్రభుత్వం పేర్కొంది.
తాజా నివేదిక ప్రకారం..
బయటకు వచ్చిన నివేదిక ప్రకారం వివిధ రకాల సజీవ వైరస్‌ శాంపిల్స్ కలిగిన 323 వయల్స్ గతేడాది ఆగస్టులో క్వీన్స్‌లాండ్‌లోని పబ్లిక్ హెల్త్ వైరాలజీ ల్యాబొరేటరీ నుంచి మాయమయ్యాయి. తాజాగా విషయం వెలుగులోకి రావడంతో అందరిలోనూ భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. మాయమైన వయల్స్‌లో ప్రమాదకర హెండ్రా వైరస్, లిసావైరస్, హంటావైరస్ వంటివి ఉన్నాయి. హెండ్రా అనేది జూనోటిక్ (జంతువుల నుంచి మనుషులకు సోకేది) వైరస్. దీనిని ఇప్పటి వరకు ఆస్ట్రేలియాలో మాత్రమే గుర్తించారు. హంటావైరస్ అనేది వైరస్‌ల కుటుంబాలకు చెందినది. ఇది తీవ్రమైన అనారోగ్యానికి గురిచేయడంతోపాటు మరణానికి కూడా కారణమవుతుంది. ఇక, లిసా వైరస్ అనేది వైరస్‌ ల సమూహానికి చెందినది. ఇది సోకితే రేబిస్ వ్యాధి వస్తుంది.
స్పష్టత లేదు
కనిపించకుండా పోయిన ఈ వయల్స్‌ను ఎవరైనా ఎత్తుకెళ్లారా? లేదంటే ధ్వంసమయ్యాయా? అన్న విషయంలో స్పష్టత లేదు. వీటివల్ల సమాజానికి పెద్దగా ముప్పు ఉండకపోవచ్చని అధికారులు తెలిపారు.

Related Posts
డ్రెస్సింగ్ రూమ్‌లో టీమిండియా సంబరాలు
డ్రెస్సింగ్ రూమ్‌లో టీమిండియా సంబరాలు

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 తొలి సెమీ ఫైనల్లో భారత్ అద్భుత విజయాన్ని సాధించింది. ఆస్ట్రేలియాను ఓడించి ఫైనల్‌ బెర్త్‌ను ఖాయం చేసుకున్న భారత జట్టు, 2023 Read more

రైలు హైజాక్ ఆపరేషన్ విజయవంతం
రైలు హైజాక్ ఆపరేషన్ విజయవంతం

పాకిస్థాన్‌లో సంచలనం సృష్టించిన రైలు హైజాక్ ఘటనకు ముగింపు పలికేలా ఆర్మీ విజయవంతమైన ఆపరేషన్‌ను నిర్వహించింది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) మిలిటెంట్లు హైజాక్ చేసిన జాఫర్ Read more

లాస్ ఏంజిల్స్ లో జరుగుతున్నఅస్కార్ అవార్డులు
లాస్ ఏంజిల్స్ లో జరుగుతున్నఅస్కార్ అవార్డులు

ఆస్కార్ 2025 అవార్డుల విజేతలు - 97వ అకాడమీ అవార్డులు సినీ రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన, అత్యున్నతమైన అవార్డులైన ఆస్కార్ అవార్డులు, ప్రతి నటుడు, ఆర్టిస్ట్ మరియు Read more

ట్రంప్ నిర్ణయాలతో కుప్పకూలుతున్న ఫార్మా స్టాక్స్
ట్రంప్ ఇరాన్‌పై కఠిన హెచ్చరిక: "ఒప్పందం కుదుర్చుకోకపోతే, బాంబులు పేలుతాయి"

ట్రంప్ అధికారంలోకి అడుగుపెట్టి పేటితో దాదాపు నెల రోజులు కావొస్తోంది. ఈ క్రమంలో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలకు శాపాలుగా మారుతున్నాయి. ప్రధాని Read more