రైలు హైజాక్ ఆపరేషన్ విజయవంతం

రైలు హైజాక్ ఆపరేషన్ విజయవంతం

పాకిస్థాన్‌లో సంచలనం సృష్టించిన రైలు హైజాక్ ఘటనకు ముగింపు పలికేలా ఆర్మీ విజయవంతమైన ఆపరేషన్‌ను నిర్వహించింది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) మిలిటెంట్లు హైజాక్ చేసిన జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రయాణికులను కాపాడేందుకు పాక్ భద్రతా దళాలు చేపట్టిన ఆపరేషన్ ఘనవిజయం సాధించింది. ఈ ఘటనలో మొత్తం 33 మంది బీఎల్ఏ మిలిటెంట్లు హతమయ్యారు. అయితే, ఈ ఎదురుకాల్పుల్లో 21 మంది సాధారణ ప్రయాణికులు, నలుగురు పారామిలిటరీ సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఆపరేషన్ విజయవంతంగా ముగిసిందని, మిగిలిన ప్రయాణికులను సురక్షితంగా రక్షించామని పాక్ ఆర్మీ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ ప్రకటించారు.

Advertisements

హైజాక్ ఘటన

బలూచిస్తాన్‌లోని క్వెట్టా నుంచి పెషావర్‌కు జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ నిన్న ఉదయం 9గంటలకు బయలుదేరింది. సుమారు 500 మంది ప్రయాణికులతో వెళుతున్న రైలుపై రిమోట్‌ ప్రాంతమైన బలోన్‌లో 8వ నంబర్‌ టన్నెల్‌ దగ్గర మిలిటెంట్లు కాల్పులు జరిపారు. రైలు ట్రాక్‌ను పేల్చివేసి ట్రైన్‌ను తమ నియంత్రణలోకి తీసుకున్నారు. ఈ ఘటనకు తామే బాధ్యులమని బలోచ్‌ లిబరేషన్‌ ఆర్మీ ప్రకటించింది. తమ దగ్గర 214 మంది బందీలుగా ఉన్నట్లు తెలిపిన మిలిటెంట్‌ సంస్థ30 మంది పాక్‌ సైనికులను చంపినట్లు పేర్కొంది. అయితేతమపై మిలిటరీ ఆపరేషన్‌ చేపడితే బందీలుగా ఉన్నవారందరినీ చంపుతామని బెదరించింది. బందీలను విడిచిపెట్టాలంటే బలోచ్‌ రాజకీయ నేరస్థులు, అదృశ్యమైన పౌరులు, కార్యకర్తలను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

ఆపరేషన్

 రంగంలోకి దిగిన ఆర్మీ విజయవంతంగా ఆపరేషన్‌ను ముగించి, రైలును తిరిగి తమ నియంత్రణలోకి తెచ్చుకుంది. మంగళవారం సాయంత్రానికి 100 మంది ప్రయాణికులను రక్షించిన భద్రతా బలగాలు, నిన్న మిగతా ప్రయాణికులను రక్షించాయి.

హైజాక్ వెనుక కారణాలు

బలూచిస్థాన్‌ పాకిస్థాన్‌ నుంచి ప్రత్యేక ప్రాంత ఆవిర్భావాన్ని కోరుతూ దశాబ్దాలుగా పోరాటం చేస్తోంది. గ్యాస్‌, ఖనిజ నిక్షేపాలు పుష్కలంగా ఉన్న ప్రాంతమైనప్పటికీ దోపిడీకి గురవుతున్నామని వాదిస్తోంది. ఈ క్రమంలోనేబలోచ్‌ లిబరేషన్‌ ఆర్మీ పేరుతో 2000లో ఏర్పాటైన సంస్థ స్థానికంగా బలీయ శక్తిగా ఎదిగింది. పాక్‌ సైన్యం, ప్రభుత్వంపై తరచూ దాడులకు పాల్పడుతున్న ఈ సంస్థను పాకిస్థాన్‌తో పాటు అమెరికా, బ్రిటన్‌లు ఉగ్ర సంస్థగా ప్రకటించాయి.

Indiahood.com 23

బలూచ్ గ్రూపులు పాకిస్తాన్ – చైనాపై కొత్త దాడిని ప్రకటించాయి. బలూచ్ యోధులు ఇటీవల సింధీ వేర్పాటువాద గ్రూపులతో విన్యాసాలు ముగించారు. ఇప్పుడు తిరుగుబాటు సంస్థలు పాకిస్తాన్ సైన్యానికి వ్యతిరేకంగా ఏకమవుతున్నాయి. సింధీ, బలూచ్ సంస్థలు కలిసి రావడం వల్ల పాకిస్తాన్‌లోని ప్రాజెక్టులకు పెద్ద ముప్పు ఏర్పడింది.

Related Posts
ప్రధానమంత్రి మోదీకి నైజీరియాలో ఘన స్వాగతం
modi nigeria

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మూడు దేశాల పర్యటన ప్రారంభించడానికి నైజీరియాలో అడుగుపెట్టారు. నైజీరియా రాజధాని అబూజాలో పీఎం మోదీని ఘనంగా స్వాగతించారు. నైజీరియా ఫెడరల్ క్యాపిటల్ Read more

వెబ్సైట్ నుంచి కుటుంబ సర్వే ఔట్.. KTR సెటైర్లు
KTR Family

తెలంగాణలో ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచిన "కుటుంబ సర్వే" పత్రం ఇప్పుడు రాజకీయ వివాదాస్పదంగా మారింది. ఈ సర్వేలో అనేక తప్పులున్నాయని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి Read more

మావోయిస్టు ప్రభావిత జిల్లాలసంఖ్య 126 నుంచి 38కి తగ్గింది-కేంద్రం
maoist 38 update

ప్రభుత్వం చేపట్టిన చర్యలలో కనెక్టివిటీకి అధిక ప్రాధాన్యత.దేశంలో ఎల్‌డబ్ల్యూఈ (లెఫ్ట్ వింగ్ ఎక్స్‌ట్రీమిజం) ప్రభావం గణనీయంగా తగ్గిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. గత ఆరేళ్లలో మావోయిస్టు ప్రభావిత Read more

రాజ్యాంగ చర్చ కోసం లోక్ సభ, రాజ్య సభ తేదీలు ఖరారు
parliament

పార్లమెంట్‌లో సోమవారం అన్ని పార్టీల నేతలతో జరిగిన సమావేశం అనంతరం, లోక్ సభ మరియు రాజ్యసభ ఎంపీలు వచ్చే వారం రాజ్యాంగంపై చర్చను నిర్వహించేందుకు అంగీకరించారు. ఈ Read more

×