New law in AP soon: CM Chandrababu

తల్లిదండ్రులు చనిపోయిన చిన్నారులకు పెన్షన్

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీలో తల్లిదండ్రులు చనిపోయి చిన్నారులు ఉంటే వారికీ పెన్షన్ ఇవ్వాలని అధికారులకు సూచించారు. దివ్యాంగులు చాలా మంది 15 వేలు పెన్షన్ అడుగుతున్నారని…అందులో సదరం ధృవీకరణ పత్రాలను అర్హులకే దక్కేలా చూడాలని తెలిపారు. ఇక అటు ఏపీలో 6 లక్షల ఫేక్‌ పెన్షన్లు ఉన్నట్లు చంద్రబాబు నాయుడు సర్కార్‌ గుర్తించినట్లు సమాచారం. రెండో రోజు కలెక్టర్ల కాన్ఫరెన్సు లో పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణపేదరిక నిర్మూలన శాఖలపై ప్రజెంటేషన్ ఇచ్చారు ఆ శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్ కుమార్. పెన్షన్ లు అర్హత లేనివారికి వస్తున్నాయనే పిర్యాదులు ఉన్నాయని వెల్లడించారు. నిర్వహించిన సర్వేలో ప్రతీ పదివేలకూ 500 మంది వరకూ అనర్హులని తేలినట్టు స్పష్టం చేశారు.

గత ప్రభుత్వ హయాంలో ఎన్నికలకు ముందు 6 లక్షల మందికి హడావుడిగా పెన్షన్లు ఇచ్చారని తెలిపారు. ఇందులో చాలా మంది అనర్హులే ఉన్నారని వ్యాఖ్యానించారు మంత్రి నాదెండ్ల మనోహర్. వచ్చే మూడు నెలల్లోగా ప్రతీ పెన్షన్ ను జిల్లా కలెక్టర్లు పరిశీలించాలని ఆదేశించారు సీఎం చంద్రబాబు. మూడు నెలల్లోపల పోలియో, అంగవైకల్యం అంశాలపై ఒక రిపోర్టు సిద్ధం కావాలని… గోదావరి పుష్కరాలకు కావాల్సిన ప్లానింగ్ పూర్తి చేయాలని చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు.

Related Posts
విజయ్ చౌక్ ఇండియా కూటమి ఎంపీల నిరసన
MPs of INDIA Alliance prote

శీతాకాల సమావేశాల చివరి రోజున కూడా పార్లమెంటు వేదికపై ఉద్రిక్తతలు కొనసాగాయి. ఇండియా కూటమి ఎంపీలు విజయ్ చౌక్ వద్ద నిరసనకు దిగారు. అంబేడ్కర్ పై అమిత్ Read more

తెలంగాణలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లు : మంత్రి పొంగులేటి
4.50 lakh Indiramma houses in Telangana.. Minister Ponguleti

హైదరాబాద్‌: తెలంగాణ మొత్తం 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ఈరోజు ఖమ్మంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ..ఇందిరమ్మ Read more

ఇళ్ల పట్టాలు రద్దు : ఆందోళనలో జనం
సీఎం చంద్రబాబు సారధ్యంలోని కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వైసీపీ హయాంలో అందించిన ఇళ్ల స్థలాల వ్యవహారంపై సర్కారు ఫోకస్ పెట్టింది.

సీఎం చంద్రబాబు సారధ్యంలోని కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వైసీపీ హయాంలో అందించిన ఇళ్ల స్థలాల వ్యవహారంపై సర్కారు ఫోకస్ పెట్టింది. అప్పట్లో అనర్హులు ఇళ్ల Read more

పెన్షన్లపై ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు
పెన్షన్లపై ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు

పెన్షన్లపై ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు అయితే తాజా పరిణామాల నేపథ్యంలో అనర్హులకు నోటీసుల జారీని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *