sithaka

పుష్ప సినిమాపై సీతక్క ఆగ్రహం

పుష్ప సినిమా పై రోజురోజుకు రాజకీయ వేడిని పుట్టిస్తున్నది. కాంగ్రెస్, తెరాసల మధ్య మాటల యుద్ధం జరుగుతున్నది. తాజాగా పుష్ప సినిమాకు గాను అల్లు అర్జున్ కు జాతీయ అవార్డు రావడంపై తెలంగాణ మంత్రి సీతక్క తీవ్ర విమర్శలు చేశారు. ఎర్ర చందనం దొంగలకు జాతీయ అవార్డులా? అంటూ మండిపడ్డారు.
అవార్డులు రాలేదు
ఈరోజు ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ… జై భీమ్ లాంటి సందేశాత్మక సినిమాలకు అవార్డులు రాలేదన్నారు. కానీ పోలీసుల బట్టలు విప్పి నిలబెట్టే సినిమాలకు అవార్డులు ఇస్తున్నారని పుష్ప సినిమాను ఉద్దేశించి ఆక్షేపించారు.

Advertisements
pushpa cinema

కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సినిమాలను ప్రోత్సహిస్తుందో ఆలోచించాలన్నారు. మానవ హక్కులను కాపాడే లాయర్ జీరో అయినప్పుడు… స్మగ్లింగ్ చేసే నటుడు హీరో ఎలా అవుతాడని ప్రశ్నించారు. సినిమాలో స్మగ్లర్ హీరో అని, కానీ స్మగ్లింగ్‌ను కట్టడి చేసే పోలీస్ విలన్ ఎలా అవుతాడని ప్రశ్నించారు. ఇలాంటి సినిమాలు నేర ప్రవృత్తిని పెంచేలా ఉన్నాయన్నారు. రెండు మర్డర్లు చేసిన వ్యక్తిని పుష్ప-2 థియేటర్లో పట్టుకున్నారని వెల్లడించారు.
సందేశాత్మక చిత్రాలను ఆదరించాలి
సందేశాత్మక చిత్రాలు తీస్తేనే ప్రజలు ఆదరించాలని సూచించారు. మానవతా దృక్పథం ఉన్న సినిమాలు రావాల్సి ఉందన్నారు. సినిమాలను మేం గౌరవిస్తామని, సినిమాలు ఓ ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే అన్నారు. కానీ ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తున్నారనేది ముఖ్యమన్నారు. సినిమా నటులు లేదా నిర్మాతలు లేదా దర్శకులు ఈ సమాజాన్ని ఉన్నతస్థితికి తీసుకెళ్లే ఆలోచనలతో సినిమాలు తీయాలన్నారు.

Related Posts
Park Hyatt Hotel: అగ్నిప్రమాదం తర్వాత హోట‌ల్‌ను ఖాళీ చేసి వెళ్లిపోయిన స‌న్‌రైజ‌ర్స్ ఆటగాళ్లు
Park Hyatt Hotel: అగ్నిప్రమాదం తర్వాత హోట‌ల్‌ను ఖాళీ చేసి వెళ్లిపోయిన స‌న్‌రైజ‌ర్స్ ఆటగాళ్లు

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ రోడ్ నంబర్‌-2లో ఉన్న ప్రముఖ స్టార్ హోటల్ పార్క్ హయత్‌లో అకస్మాత్తుగా అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. నగరంలోని ప్రముఖ ప్రాంతాల్లో ఒకటైన ఈ హోటల్లో Read more

Drugs : గంజాయి,నిందితుల్లో గుబులు
Drugs : గంజాయి,నిందితుల్లో గుబులు

తెలంగాణలో గంజాయి, డ్రగ్స్ కేసులపై ఎక్సైజ్ శాఖ తీసుకుంటున్న కఠిన చర్యలు ఇప్పుడు నేరస్థుల్లో గుబులు పుట్టిస్తున్నాయి. గంజాయి, డ్రగ్స్ కేసుల్లో వరుసగా శిక్షలు పడుతుండటంతో నిందితుల్లో Read more

Smitha Sabarwal : సుప్రీంకోర్టు ఆదేశాలను పాటిస్తామన్న శ్రీధర్ బాబు
Smitha Sabarwal సుప్రీంకోర్టు ఆదేశాలను పాటిస్తామన్న శ్రీధర్ బాబు

కంచ గచ్చిబౌలి భూముల వివాదం మళ్లీ హాట్ టాపిక్ అయ్యింది తాజాగా ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ చేసిన ఒక సోషల్ మీడియా పోస్టు చర్చనీయాంశమైంది. ఆమె Read more

నేడు కలెక్టర్లతో సీఎం రేవంత్‌ రెడ్డి భేటి
CM Revanth Reddy meet the collectors today

హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు జిల్లా కలెక్టర్లతో సమావేశం కానున్నారు. సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు కలెక్టర్లతో భేటీ అయి రైతు భరోసా, రేషన్‌ Read more

Advertisements
×