balineni janasena

పిఠాపురం వేదికగా బాలినేని నిప్పులు

మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జనసేన 12వ ఆవిర్భావ సభలో పాల్గొన్న ఆయన, జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్వశక్తితో ఎదిగిన నాయకుడని కొనియాడారు. అయితే, జగన్ మాత్రం తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణాన్ని రాజకీయ లబ్ధికి ఉపయోగించుకుని సీఎం అయ్యారని ఆరోపించారు. తన రాజకీయ జీవితాన్ని, గతంలో జగన్ కోసం తీసుకున్న నిర్ణయాలను ప్రస్తావిస్తూ బాలినేని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

“నా ఆస్తి పోయింది.. జగన్ మాత్రం మరింత సంపాదించారు”

రాజకీయాల్లోకి వచ్చాక తన తండ్రి ఆస్తిలో సగానికి పైగా పోగొట్టుకున్నానని బాలినేని అన్నారు. కానీ, జగన్ మాత్రం తన ఆస్తులతో పాటు వియ్యంకుడి ఆస్తులను కూడా స్వాహా చేసుకున్నారని ఆరోపించారు. జగన్ పాలనలో తనకు జరిగిన అన్యాయం మరెవరికి జరగకూడదని, తనకు తెలిసిన అన్ని నిజాలు ఒక్కొక్కటిగా బయట పెడతానని హెచ్చరించారు. రాజకీయంగా ఎంతటి పోరాటం ఎదురైనా వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

janasena formation day2025
janasena formation day2025

“జగన్‌కు రాజశేఖర్ రెడ్డి ఆశీర్వాదం, పవన్ కల్యాణ్ స్వశక్తి”

బాలినేని మాట్లాడుతూ, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనకు రాజకీయ భిక్ష పెట్టారని, అందుకే జగన్ వెంటే నడిచానని గుర్తు చేసుకున్నారు. కానీ, జగన్ తనను మోసం చేసి మొదట మంత్రి పదవి ఇచ్చి, తర్వాత తీసేశారని ఆరోపించారు. పవన్ కల్యాణ్ గురించి జగన్ చేసిన వ్యాఖ్యలపై కూడా తీవ్రంగా స్పందించారు. “పవన్ కల్యాణ్ కౌన్సిలర్ స్థాయి నాయకుడు” అనే జగన్ వ్యాఖ్యలను ఎద్దేవా చేస్తూ, “జగన్ స్వయంకృషితో ఎదిగిన నాయకుడు కాదు, తన తండ్రి దయతో సీఎం అయ్యాడు” అని ధ్వజమెత్తారు.

“కూటమి ఓపిక పడింది.. నేను ఉంటే లోపల వేసేవాడిని”

పవన్ కల్యాణ్ పోరాట శక్తిని ప్రశంసించిన బాలినేని, వైసీపీ పాలనలో జరిగిన అరెస్టుల గురించి ప్రస్తావించారు. పోసాని కృష్ణమురళీ, వల్లభనేని వంశీల అరెస్టుల సమయంలో జగన్ వెంటనే పరామర్శకు వెళ్లారని, అదే సమయంలో కుటుంబ సభ్యులను తిడితే ఎవ్వరూ ఊరుకోరని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం ఆరు నెలలు ఓపిక పట్టిందని, తాను అధికారంలో ఉంటే ప్రజలకు నష్టం కలిగించిన వారిని లాఠీతో కొట్టి లోపల వేయించే వాడినని వ్యాఖ్యానించారు.

Related Posts
విజయసాయిరెడ్డికి ఏపీ సీఐడీ నోటీసులు
AP CID notices to Vijayasai Reddy

అమరావతి: మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. బుధవారం విజయవాడ సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఏ కేసులో Read more

6న తెలంగాణ క్యాబినెట్ భేటీ
Telangana Cabinet M9

క్యాబినెట్ భేటీ తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈనెల 6న సమావేశం కానుంది. ఈ భేటీలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు Read more

ఆరిలోవ లో నూతన పోలీస్ భవనాన్ని ప్రారంభించిన హోం మంత్రి అనిత
Home Minister Anitha inaugu

ఆరిలోవ హనుమంతువాక వద్ద ఎకరం స్థలంలో 17 గదులతో విశాలముగా నిర్మించిన ఆరిలోవ పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని ఆదివారం రాష్ట్ర హోం శాఖ మంత్రివర్యులు వంగలపూడి Read more

Revanth Reddy : సన్ రైజర్స్ పై స్పందించిన రేవంత్ రెడ్డి
Revanth Reddy సన్ రైజర్స్ పై స్పందించిన రేవంత్ రెడ్డి

Revanth Reddy : సన్ రైజర్స్ పై స్పందించిన రేవంత్ రెడ్డి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) మరియు సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య నెలకొన్న Read more