విజయసాయిరెడ్డికి ఏపీ సీఐడీ నోటీసులు

విజయసాయిరెడ్డికి ఏపీ సీఐడీ నోటీసులు

అమరావతి: మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. బుధవారం విజయవాడ సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఏ కేసులో అన్నదానిపై స్పష్టత లేదు కానీ.. కాకినాడ పోర్టు కేసులో కావొచ్చని భావిస్తున్నారు. కాకినాడ పోర్టును బలవంతంగా రాయించుకున్నారన్న ఆరోపణలపై ఆయనపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో ఈడీ కూడా విచారణకు పిలించింది కానీ సీఐడీ ఇంకా పిలువలేదు. ఆ కేసులో ఇప్పుడు విచారణకు పిలిచినట్లుగా భావిస్తున్నారు. నోటిసుల్లో 506, 384, 420, 109,467, 120(b) రెడ్ విత్ 34 BNS సెక్షన్లును పేర్కొన్నారు. ఇవి కఠినమైన సెక్షన్లుగానే భావిస్తున్నారు.

Advertisements
విజయసాయిరెడ్డికి ఏపీ సీఐడీ నోటీసులు

ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ

కాకినాడ సీపోర్టును బెదిరించి అన్యాయంగా వాటాలను రాయించుకున్నారని ఆ పోర్టు యజమాని కేవీ రావు సీఐడీకి ఫిర్యాదు చేశారు. ఈ కేసులో వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్‌ రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి, అరబిందో ఫార్మాకు చెందిన శరత్‌ చంద్రారెడ్డి, చెన్నైకు చెందిన ఆడిటింగ్‌ కంపెనీ పీకేఎఫ్‌ ప్రతినిధులు సుందర్‌, విశ్వనాథ్‌, ప్రసన్నకుమార్‌, అపర్ణలను నిందితులుగా చేర్చారు. సెజ్‌ను తమ పేరుతో రాయించుకున్న అరబిందో ఇన్‌ఫ్రాను కేసులో చేర్చారు. వాటాలు రాసివ్వకపోతే అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిస్తామని కేవీ రావును బెదిరించి, భయపెట్టి అత్యధిక షేర్లను అరబిందో సంస్థ సొంతం చేసుకున్నారని కేవీ రావు ఫిర్యాదు చేశారు. విజయసాయిరెడ్డి ఈకేసులో విదేశాలకు పారిపోకుండా ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేశారు.

వచ్చే జూన్ లేదా జూలైలో బీజేపీలోకి

ఈ కేసులో ఇప్పటికే ఈడీ కూడా విజయసాయిరెడ్డిని ప్రశ్నించింది. ఆ తర్వాత ఆయ న రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. వైసీపీకి కూడా రాజీనామా చేశారు. తాను పొలం పనులు చేసుకుంటానని ప్రకటించారు. అయితే ఆయన వచ్చే జూన్ లేదా జూలైలో బీజేపీలో చేరడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారని చెబుతున్నారు. రాజకీయాల నుంచి విరమించుకున్నా ఆయనపై కేసులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా కాకినాడ పోర్టు వ్యవహారంలో ప్రభుత్వ అధికారాన్ని ఘోరంగా దుర్వినియోగం చేసి ఆస్తులు కాజేశారన్న ఆరోపణలను సీఐడీ చాలా సీరియస్ గా తీసుకున్నట్లుగా కనిపిస్తోంది.

Related Posts
మందుబాబులకు షాకింగ్ న్యూస్..తెలంగాణలో పెరుగనున్న మద్యం ధరలు..!
Liquor prices to increase in Telangana

హైదరాబాద్‌: తెలంగాణలో మద్యం ధరలను సవరించేందుకు ఆబ్కారీ శాఖ శ్రమిస్తోంది. ఏపీలో మద్యం ధరలను సమానంగా చేయాలని ప్రభుత్వ యోచనలో ఉందని సమాచారం. త్వరలో బీరుకు రూ. Read more

మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ
Maoist Bade Chokka Rao amon

ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్‌ లో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భద్రతా బలగాలు నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో తెలంగాణ మావోయిస్ట్ పార్టీ సెక్రటరీ బడే Read more

జీల‌క‌ర్ర బెల్లంతో గ్రూప్‌-2 ప‌రీక్ష‌కు హాజరు.
జీల‌క‌ర్ర బెల్లంతో గ్రూప్‌-2 ప‌రీక్ష‌కు హాజరు.

ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు భారీ వివాదాలు, గందరగోళ పరిస్థితుల మధ్య ప్రారంభమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 175 పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించబడుతున్నాయి. మొత్తం 92,250 మంది Read more

మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం
Jalgaon Train Tragedy

మహారాష్ట్ర జలగావ్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. పరండా రైల్వే స్టేషన్ సమీపంలో కర్ణాటక ఎక్స్ ప్రెస్ ట్రైన్ వేగంగా వచ్చి పలువురు ప్రయాణికులను ఢీకొట్టడంతో Read more

×