AP High Court appoints three new judges copy

ఏపీ హైకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకం..

అమరావతి: ఏపీ హైకోర్టుకు కొత్తగా ముగ్గురు న్యాయమూర్తులు నియవితులయ్యారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులోనే న్యాయవాదులుగా సేవలందిస్తున్న కుంచం మహేశ్వరరావు, తూట చంద్ర ధనశేఖర్, చల్లా గుణరంజన్‌లను అదనపు జడ్జిలుగా నియామకానికి రాష్ట్రపతి ఆమోదం లభించింది.

వీరి నియామకం కోసం ఇటీవల సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫారసు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిలతో చర్చించిన తర్వాత వీరిని ఏపీ హైకోర్టులో అదనపు జడ్జిలుగా నియమిస్తున్నట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్వాల్‌ ‘ఎక్స్‌’లో వెల్లడించారు. అలాగే, కర్ణాటక హైకోర్టులో అదనపు జడ్జిగా ఉన్న జస్టిస్‌ సిద్ధయ్య రాచయ్యను అదే హైకోర్టులో శాశ్వత జడ్జిగా నియమించినట్లు తెలిపారు.

ప్రస్తుతం ఏపీ హైకోర్టులో 26 మంది న్యాయమూర్తులు పనిచేస్తున్నారు. వీరిలో సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ నరేందర్‌ పేరును ఉత్తరాఖండ్‌ హైకోర్టు సీజేగా ఇటీవల సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసిన విషయం తెలిసిందే. తాజాగా వీరి నియామకంతో హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 29కి చేరింది. ఏపీ హైకోర్టులో మొత్తం 37 మంది జడ్జీల నియామకానికి ఆమోదం ఉంది.

Related Posts
NHRC చీఫ్ నియామకంపై కాంగ్రెస్ ఆందోళన
NHRC చీఫ్ నియామకంపై కాంగ్రెస్ ఆందోళన

మానవ హక్కుల ప్యానెల్ చీఫ్ నియామకంపై కాంగ్రెస్ అసంతృప్తి కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ మరియు మల్లికార్జున్ ఖర్గే జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సి) చైర్‌పర్సన్ Read more

రతన్ టాటా ఇక లేరు
ratan tata dies

ప్రముఖ వ్యాపారవేత్త, టాటా సన్స్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా (86) మరణించారు. అనారోగ్యంతో గత అర్ధరాత్రి ముంబైలోని బ్రీచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. టాటా Read more

గణతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
hyd Traffic Restrictions

గణతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో నేడు ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానం వద్ద ఉదయం 7:30 గంటల Read more

అమిత్ షా పై షర్మిల ఫైర్
అమిత్ షా పై షర్మిల ఫైర్

కేంద్ర హోంమంత్రి అమిత్ షా పై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రమైన విమర్శలు చేశారు. అమిత్ షా వ్యాఖ్యలకు జవాబుదారీతనం లేదని ఆరోపించిన షర్మిల, Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *