డిసెంబర్ 04 బుధువారం హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియో లో నాగ చైతన్య – శోభితల వివాహం అట్టహాసంగా జరిగింది. హిందూ సంప్రదాయ పద్ధతిలో ఈ పెళ్లి వేడుక జరిగింది. ఈ వేడుకకు ఇరు కుటుంబసభ్యులు, సినీ పెద్దలు, సన్నిహితులు, బంధువులు హాజరయ్యారు.
మెగాస్టార్ చిరంజీవితో పాటు వ్యాపారవేత్త టీ సుబ్బరామి రెడ్డి, చాముండేశ్వరినాథ్, రాణా దగ్గుబాటి, సుహాసిని, అడవి శేష్, దర్శకుడు కళ్యాణ్ కృష్ణ, అల్లు అరవింద్ దంపతులు, సంగీత దర్శకుడు కీరవాణి, దర్శకుడు శశికిరణ్ తిక్క, అశోక్ గల్లా, దర్శకుడు చందు మొండేటితో పాటు పలువురు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రముఖులు వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం పెళ్లికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. పలువురు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఈ పెళ్లి వేడుక ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నూతన దంపతులకు అభిమానులు, నెటిజన్లు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా, చై – శోభిత నిశ్చితార్థం ఆగస్టులో జరిగిన విషయం తెలిసిందే. ఇకపోతే మరోవైపు, నాగచైతన్య సోదరుడు, హీరో అఖిల్‌కు కూడా ఇటీవల నిశ్చితార్థం జరిగింది. వచ్చే ఏడాది పెళ్లి చేసుకోనునున్నాడు.