glass bridge

అందుబాటులో కన్యాకుమారి గ్లాస్ బ్రిడ్జి

మరికొన్ని గంటల్లో కొత్త ఆశయాలు, కోరికలతో నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి కొత్త ఏడాది వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవడానికి ప్రాధాన్యత ఇస్తారు చాలామంది. కొత్త ఏడాదిని స్వాగతం పలకడానికి భారత్ సహా అన్ని దేశాలు సంసిద్ధం అయ్యాయి. ఒక్కో దేశం ఒక్కో విధంగా కొత్త ఏడాదిలోకి ప్రవేశానికి ఏర్పాట్లు చేసుకుంటుంన్నాయి.
ఈ క్రమంలో దక్షిణాన చిట్టచివరి ప్రాంతం కన్యాకుమారికి వెళ్లే వారికి శుభవార్త వినిపించింది తమిళనాడు ప్రభుత్వం.

Advertisements


గ్లాస్ బ్రిడ్జిని ప్రారంభించిన ఎంకే స్టాలిన్
కన్యాకుమారి వద్ద కొత్తగా నిర్మించిన గ్లాస్ బ్రిడ్జిని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్.. దీన్ని ప్రారంభించారు. పర్యాటకుల కోసం ఈ గ్లాస్ బ్రిడ్జిని అందుబాటులోకి తీసుకొచ్చారు. కొందరు మంత్రులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతిష్ఠాత్మక తిరువళ్లువర్ విగ్రహం- వివేకానంద రాక్ మెమోరియల్‌ను కనెక్ట్ చేస్తూ నిర్మితమైన అద్దాల వంతెన ఇది. దీని నిర్మాణ వ్యయం 37 కోట్ల రూపాయలు. బంగాళాఖాతం- హిందూ మహా సముద్రం సంగమించే ప్రదేశంపై ఇది నిర్మితమైంది. దీని పొడవు 77 మీటర్లు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే ప్రభుత్వం దీన్ని నిర్మించింది. 133 అడుగుల ఎత్తు ఉన్న తిరువళ్లువర్ విగ్రహాన్ని నెలకొల్పి 25 సంవత్సరాలవుతోంది. 2000 సంవత్సరంలో తమిళనాడు ప్రభుత్వం దీన్ని ఏర్పాటు చేసింది. అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధి దీన్ని ప్రారంభించారు. 25 ఏళ్లు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని మూడు రోజుల పాటు తిరువళ్లువర్ ఉత్సవాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఈ గ్లాస్ బ్రిడ్జిని నిర్మించింది.

Related Posts
IPL 2025: ముగిసిన మరో కీలక మ్యాచ్
IPL 2025: ముగిసిన మరో కీలక మ్యాచ్

ఐపీఎల్ 2025లో మరో కీలక పోరు ముగిసింది ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య హైఓక్టేన్ మ్యాచ్ Read more

కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్‌ బిల్లు: సీతారామన్ సంచలన ప్రకటన
కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్‌ బిల్లు సీతారామన్ సంచలనం ప్రకటన

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త ఆదాయపు పన్ను చట్టంపై ముఖ్యమైన ప్రకటన చేశారు. ఈ చట్టం, వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు పన్ను ప్రక్రియను సులభతరం Read more

మోడీ పాలనలో 9వేల మంది మిలిటెంట్లు లొంగుబాటు
amithsha

మోడీ పాలనలో 9వేల మంది మిలిటెంట్లు లొంగుబాటు--కేంద్ర మంత్రి అమిత్ షా అగర్తలా : ప్రధాని నరేంద్రమోడీ పదేళ్ల పాలనలో దేశంలో ఉగ్రదాడులు తగ్గుముఖం పట్టాయని కేంద్ర Read more

ప్రైవేట్ మెడికల్ కాలేజీల స్టైఫండ్ బాధ్యత రాష్ట్రాలదే : ఆర్టీఐ
ప్రైవేట్ మెడికల్ కాలేజీల స్టైఫండ్ బాధ్యత రాష్ట్రాలదే : ఆర్టీఐ

198 మెడికల్ కాలేజీలు,సంస్థలు దాని అండర్ గ్రాడ్యుయేట్ ఇంటర్న్‌లు, పోస్ట్ గ్రాడ్యుయేట్ రెసిడెంట్‌లు, సీనియర్ రెసిడెంట్‌లకు స్టైపెండ్‌లు చెల్లించని సమస్యపై నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) చేతులు Read more

Advertisements
×