మోడీ పాలనలో 9వేల మంది మిలిటెంట్లు లొంగుబాటు
–కేంద్ర మంత్రి అమిత్ షా
అగర్తలా : ప్రధాని నరేంద్రమోడీ పదేళ్ల పాలనలో దేశంలో ఉగ్రదాడులు తగ్గుముఖం పట్టాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఈ పదేళ్లలో ఈశాన్య భారత్లో దాదాపు 9 వేల మంది సాయుధ మిలిటెంట్లు లొంగిపోయారని అన్నారు. అగర్తలలో జరిగిన నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ 72వ ప్లీనరీ సమావేశంలో అమిత్ షా పాల్గొని, ప్రసంగించారు. 20 శాంతి ఒప్పందాల ద్వారా ఈశాన్య భారత్ లో ప్రధాని శాంతి నెలకొల్పారని రాష్ట్రాల అభివృద్ధికి కృషి చేశారని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఈశాన్య భారత్లో రైలు, అనుసంధానత కోసం రూ.81 వేల కోట్లు, రోడ్ల నిర్మాణానికి రూ.41 వేల కోట్లు ఖర్చు చేసిందని వెల్లడించారు. అంతేకాకుండా ఈ రాష్ట్రాల్లో సేంద్రియ సాగుపై కేంద్ర ప్రభుత్వంపై దృష్టి సాదించిందదని తెలిపారు. దీనికోసం ఇప్పటికే నేషనల్ ఆర్గానిక్ కార్పొరేషన్ లిమిటెడ్ను ఏర్పాటు చేసిందన్నారు. సేంద్రీయ ఉత్పత్తుల ప్యాకేజింగ్, మార్కెటింగ్, ఎగుమతి కోసం ఎన్ఎసిఎల్ ఒప్పందాలు కుదుర్చుకోవాలని ఈశాన్య రాష్ట్రాల సిఎంలు అభ్యర్ధించారన్నారు. నాలుగు దశాబ్దాలుగా పోలీసులు వేర్పాటు వాదులతో పోరాడారని ఈ కారణం గా ప్రస్తుతం వారి దాడులు తగ్గాయి, ఇకపై ప్రజలకు సత్వర న్యాయం చేసేలా పోలీసు యంత్రాంగం తీరులో మార్పు రావాల్సిన సమయం ఆసన్నమైందని హోంమంత్రి పేర్కొన్నారు.