kanimozhi

జమిని బిల్లు రాజ్యాంగ విరుద్ధం : ఎంపీ కనిమొళి

‘ఒకే దేశం, ఒకే ఎన్నిక బిల్లును తాము వ్యతిరేకిస్తున్నట్లు లోక్‌సభలో ఖరాఖండిగా చెప్పామని డీఎంకే ఎంపీ కనిమొళి చెప్పారు. వన్‌ నేషన్‌, వన్‌ ఎలక్షన్‌ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని, అందుకే తాము దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఆమె తెలిపారు. వన్‌ నేషన్‌, వన్‌ ఎలక్షన్‌ బిల్లు సమాఖ్య హక్కులకు, ప్రజల ఆకాంక్షలకు కూడా విరుద్ధమని అన్నారు.
ప్రజలు రాష్ట్ర ప్రభుత్వాలను ఐదేళ్ల కాలానికి ఎన్నుకుంటారని, కానీ మీరు వాళ్ల హక్కును దూరం చేస్తారని అనుకోవడం లేదని కనిమొళి వ్యాఖ్యానించారు. బీజేపీ తమ ఇష్టానుసారంగా పాలని చేస్తుందని, ప్రజల ఇష్టాలకు పరిగణనలోనికి తీసుకోవడం లేదని ఆమె విమర్శించారు. ప్రభుత్వం ఎన్నేళ్లు ఉండాలనే అధికారాన్ని ప్రజల నుంచి లాక్కుని కేంద్ర ఎన్నికల సంఘానికి ఇవ్వడం కరెక్ట్‌ కాదని అన్నారు. అలా చేయడం రాష్ట్రాలకు, సమాఖ్య స్ఫూర్తికి, రాజ్యాంగానికి వ్యతిరేకమని అన్నారు.
రాజ్యాంగ ప్రాథమిక సూత్రాలకు విఘాతం
కేంద్రం ఆ బిల్లును అమల్లోకి తీసుకొస్తే రాజ్యాంగ ప్రాథమిక సూత్రాలకు విఘాతం కలుగుతుందని అన్నారు. కాబట్టి తాము ఈ బిల్లును అంగీకరించబోమని అన్నారు. ఇవాళ కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్‌వాల్‌ వన్‌ నేషన్‌, వన్‌ ఎలక్షన్‌ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. దాంతోపాటే బిల్లును జేపీసీకి పంపాలని ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనపై లోక్‌సభలో ఓటింగ్‌ నిర్వహించి జేపీసీకి అప్పగించారు.

Advertisements
Related Posts
దీపికా పదుకొణె కీలక వ్యాఖ్య‌లు
దీపికా పదుకొణె కీలక వ్యాఖ్య‌లు

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ప్ర‌తి ఏటా నిర్వ‌హించే 'ప‌రీక్షా పే చ‌ర్చ' కార్య‌క్ర‌మంలో ఈసారి బాలీవుడ్ న‌టి దీపికా పదుకొణె పాల్గొన్న విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా Read more

అహ్మదాబాద్ కొల్డ్‌ప్లే కాన్సర్టు: టికెట్ల రెసెల్లింగ్ దరల పై చర్చ
coldplay

కొల్డ్‌ప్లే యొక్క అహ్మదాబాద్‌లో జరిగే కాన్సర్టు టికెట్లు అధికారికంగా అమ్మకానికి పెట్టగానే కొన్ని నిమిషాల వ్యవధిలోనే అవి రీసెలింగ్ ప్లాట్‌ఫామ్‌లలో కనిపించాయి. టికెట్లు మళ్లీ విక్రయించబడటంతో, అవి Read more

హర్యానా ఎన్నికలు.. డేరా బాబాకు మరోసారి పెరోల్‌
Haryana elections. Parole of Dera Baba once again

Haryana elections.. Parole of Dera Baba once again న్యూఢిల్లీ: ఇద్దరు మహిళలపై లైంగికదాడికి పాల్పడ్డాడన్న కేసులో దోషిగా తేలిన ‘డేరా సచ్చా సౌదా’ చీఫ్‌ Read more

కేజ్రీవాల్ కు రాహుల్ గాంధీ సవాల్
kejrival rahul gandhi

ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ కు, ప్రధాని నరేంద్ర మోదీకి తేడా లేదని, ఇద్దరూ ఒకటేనని రాహుల్ ఆరోపించారు. ఇటు ఆప్ లో, అటు బీజేపీలో.. రెండు Read more

×