nirmala

విజయ్ మాల్యా 14 వేల కోట్లు బ్యాంకులకు జమ: నిర్మలా సీతారామన్

బ్యాంకు రుణాలను ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరస్థులను రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నది. అయితే అక్కడి చట్టాలు వారికీ అనుకూలంగా తీర్పులు వస్తున్నాయి. దీనితో వారి ఆస్తులను వేలం ద్వారా ఆ నష్టాలను నుంచి బయటపడేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఇందులో భాగంగా బ్యాంకు రుణాలను ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరస్థుల నుంచి ఈ ఏడాది రూ.22 వేల కోట్లు రాబట్టామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో వెల్లడించారు. పరారీలో ఉన్న వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు దేశంలో ఉన్న ఆస్తులను వేలం వేసి రూ.14 వేల కోట్లు బ్యాంకుల్లో జమ చేసినట్లు వివరించారు. అదేవిధంగా గుజరాత్ కు చెందిన వజ్రాల వ్యాపారి, బ్యాంకు రుణాల ఎగవేతదారు నీరవ్ మోదీ ఆస్తులు అమ్మి వెయ్యి కోట్లు వసూలు చేశామన్నారు.
స్పెషల్ కోర్టును ఆశ్రయించాం
మిగతా ఎగవేతదారుల నుంచి ఏడు వేల కోట్లు వసూలు చేసి మొత్తంగా రూ.22,280 కోట్లు వివిధ బ్యాంకులకు జమ చేశామని చెప్పారు. ఇందుకోసం ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), బ్యాంకులు సంయుక్తంగా ముంబైలోని స్పెషల్ కోర్టును ఆశ్రయించాయని తెలిపారు.
మెహుల్ చోక్సీని వదలిపెట్టలేదు
మరో వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీకి చెందిన రూ.2,566 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసిందని, ఈ ఆస్తులను కూడా వేలం వేసేందుకు స్పెషల్ కోర్టు అనుమతిచ్చిందని నిర్మలా సీతారామన్ చెప్పారు. పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి తీసుకున్న సుమారు 13 వేల కోట్లకు పైగా రుణాలను చోక్సీ చెల్లించలేదని తెలిపారు. దీంతో ఈడీ జప్తు చేసిన ఆస్తులను వేలం వేసి పంజాబ్ నేషనల్ బ్యాంకుతో పాటు ఇతర రుణదాతలకు చెల్లించాలని ముంబై స్పెషల్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. పీఎంఎల్ఏ చట్టం ఆధారంగా రుణాల ఎగవేతదారుల నుంచి సొమ్ము రాబడుతున్నట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారు.

Advertisements
Related Posts
Revanth Reddy : ప్రధాని మోడీకి రేవంత్ రెడ్డి లేఖ
Revanth Reddy letter to Prime Minister Modi

Revanth Reddy : ప్రధాని మోడీకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖ రాశారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎం, సీపీఐ నాయకులతో ప్రధానిని కలిసేందుకు అపాయింట్ Read more

సౌత్వెస్ట్ ఎయిర్‌లైన్స్ విమానం గన్‌ఫైర్‌కి గురి
southwest airlines

అమెరికాలోని డల్లాస్, టెక్సాస్ నుండి ఇండియానా రాష్ట్రంలోని ఇండియానపోలిస్‌కు ప్రయాణిస్తున్న సౌత్వెస్ట్ ఎయిర్‌లైన్స్ విమానం గురువారం రాత్రి గన్‌ఫైర్‌కి గురైంది. ఈ సంఘటన శుక్రవారం సాయంత్రం 8:30 Read more

పాకిస్థాన్లో ఆత్మాహుతి దాడి
attack kills 10 soldiers in

పాకిస్థాన్లో మరోసారి ఆత్మాహుతి దాడి జరిగింది. బన్నూలోని చెక్ పాయింట్ వద్ద ఉన్న ఓ కారును ఆత్మాహుతి దళ సభ్యుడు పేల్చివేశాడు. కారును పేల్చిన అనంతరం అతని Read more

రన్యారావ్ ఇళ్లలో ED దాడులు..పెద్ద ఎత్తున బంగారం సీజ్
రన్యారావు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి

కర్ణాటక గోల్డ్ స్మగ్లింగ్ కేసు నేపథ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దాడులు ముమ్మరం చేసింది. బెంగళూరులోని ఎనిమిది ప్రదేశాల్లో ఒకేసారి ఈ దాడులు నిర్వహించాయి. ఇందులో కోరమండలం Read more

×