attack kills 10 soldiers in

పాకిస్థాన్లో ఆత్మాహుతి దాడి

పాకిస్థాన్లో మరోసారి ఆత్మాహుతి దాడి జరిగింది. బన్నూలోని చెక్ పాయింట్ వద్ద ఉన్న ఓ కారును ఆత్మాహుతి దళ సభ్యుడు పేల్చివేశాడు. కారును పేల్చిన అనంతరం అతని సహచరులు కాల్పులకు పాల్పడినట్లు అక్కడి మీడియా పేర్కొంది. ఈ ఘటనలో 10 మంది సైనికులు మృతి చెందినట్లు తెలుస్తోంది. మరో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయని, వారికి చికిత్స అందిస్తున్నామని ఓ అధికారి తెలిపారు. ఈ దాడికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisements

పది రోజుల క్రితం కూడా పాక్ లో ఆత్మాహుతి దాడి జరిగి 27 మంది మృతి చెందగా..పదుల సంఖ్యలో గాయపడ్డారు. పాకిస్థాన్‌లోని క్వెట్టా రైల్వే స్టేషన్‌పై నవంబర్ 09 న ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో 27 మంది మృతి చెందగా..ఇందులో 14మంది భద్రతాసిబ్బంది ఉన్నారు. మరో 62 మంది గాయపడ్డారు. ప్లాట్‌ఫామ్‌ నుంచి ఓ రైలు పెషావర్‌కు బయలుదేరుతుండగా పేలుడు సంభవించింది.

రైల్వే స్టేషన్​లోని బుకింగ్ కార్యాలయంలో దుండగుడు ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు క్వెట్టా డివిజన్ కమిషనర్ హంజా సఫ్తాక్​ తెలిపారు. దుండగుడు లగేజ్​తో రైల్వే స్టేషన్​లోకి వచ్చాడని చెప్పారు. అయితే ఆత్మాహుతి దాడి చేయడానికి వచ్చే వారికి నిలువరించడం కష్టమని అన్నారు. కాగా, పేలుడు ధాటికి ప్లాట్​ఫామ్​ పైకప్పు దెబ్బతిన్నట్లు అధికారులు వెల్లడించారు. బాంబు పేలుడు శబ్ధం నగరంలోని వివిధ ప్రాంతాలకు వినిపించింది. ఈ దాడికి బలూచ్​ లిబరేషన్​ ఆర్మీ- బీఎల్​ఏ బాధ్యత వహించింది. బీఎల్​ఏను పాకిస్థాన్ ప్రభుత్వం ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. బలూచిస్థాన్​లోని వనరులను పాకిస్థాన్​ కేంద్ర ప్రభుత్వం దండుకుంటూ, ఈ ప్రాంతం అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తోందని బీఎల్​ఏ ఆరోపించింది. వీటిని పాక్​ ప్రభుత్వం తిప్పికొట్టింది. ఇక్కడి వారితో కలిసి విదేశీ శక్తులు చేస్తున్న కుట్రగా అభివర్ణించింది.

కాగా, పాకిస్థాన్​లో ముఖ్యంగా బలూచిస్థాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లలో గత ఏడాది కాలంలో ఇలాంటిఘటనలు పెరిగాయి. సెంటర్​ ఫర్​ రీసెర్చ్​ అండ సెక్యురిటీ స్టడీస్​(CRSS) ప్రకారం ఈ ఏడాది మూడో త్రైమాసికంలో పాకిస్థాన్​లో హింసాత్మక ఘటనలు 90శాతం పెరిగాయని స్థానిక మీడియా పేర్కొంది.

Related Posts
Yemen: యెమెన్‌లో అమెరికా వైమానిక దాడులు ట్రంప్ హెచ్చరిక
Yemen: యెమెన్‌లో అమెరికా వైమానిక దాడులు ట్రంప్ హెచ్చరిక

యెమెన్‌లో అమెరికా దాడులు – 24 మంది మృతి యెమెన్‌లో అమెరికా జరిపిన వైమానిక దాడుల్లో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. హౌతీ ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని Read more

అమెరికా ఫెడరల్ ఉద్యోగుల నివేదికను కోరుతూ ఇమెయిల్
టెస్లాపై దాడి చేస్తే 20ఏళ్లు జైలని ట్రంప్ వార్నింగ్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ ఖర్చులను తగ్గించే కార్యక్రమంలో భాగంగా, ఫెడరల్ ఉద్యోగులకు ఉద్యోగాలను సమర్థించుకోవాలని కోరుతూ రెండవ ఇమెయిల్ పంపారు. మీడియా నివేదికల ప్రకారం, Read more

ప్రపంచ కుబేరుల జాబితా.. అరుదైన ఘనతను సొంతం చేసుకున్న జుకర్‌ బర్గ్‌
Zuckerberg passes Bezos to become worlds second richest person

Zuckerberg passes Bezos to become world’s second-richest person న్యూయార్క్‌ : మెటా సీఈవో మార్క్‌ జుకర్‌ బర్గ్‌ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ప్రపంచంలోనే Read more

ప్రక్షాళన పేరుతో ప్రభుత్వ వెబ్ సైట్లను మూసివేస్తున్న ట్రంప్
ట్రంప్ విధానాలతో లక్ష ఉద్యోగాలకు ఎసరు!

అమెరికాలో రెండోసారి అధ్యక్ష పదవిని చేపట్టిన డొనాల్డ్ ట్రంప్.. పలు సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు.ఇప్పటికే అక్రమ వలసదారులను సొంతగూటికి పంపించేందుకు సిద్ధమయ్యారు. అటు విధులకు హాజరుకాని ప్రభుత్వ Read more

Advertisements
×