allu arjun

కోర్టులో కొనసాగుతున్న అల్లు అర్జున్ వాదనలు

నాంపల్లి కోర్టులో శుక్రవారం (నేడు) అల్లు అర్జున్ కేసుకు సంబంధించిన వాదనలు కొనసాగుతున్నాయి. కాగా అల్లు అర్జున్‌కు న్యాయస్థానం విధించిన 14 రోజుల రిమాండ్ ఈరోజుతో పూర్తి కాగా.. వ్యక్తిగతంగా విచారణకు ఆయన హాజరుకావాల్సి ఉంది. అయితే శాంతి భద్రతల నేపథ్యంలో వర్చువల్‌గా హాజరు అవుతారని ఆయన తరఫు న్యాయవాదులు కోర్టును అభ్యర్థించారు. వారి విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన న్యాయస్థానం వర్చువల్‌ విధానంలో హాజరయ్యేందుకు అనుమతి ఇచ్చింది.

Advertisements

సంధ్య థియేటర్ ఘటనలో పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్‌ శుక్రవారం నాంపల్లి కోర్టు కు వర్చువల్‌ లో విధానంలో హాజరు అయినారు. ఇదే కేసులో అల్లు అర్జున్‌కు హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ రోజు నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ హాజరై హైకోర్టు బెయిల్ మంజూరు చేసినట్లు ఆయన తెలపాల్సి ఉంది.

కాగా టాలీవుడ్ హీరో అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు ఈనెల 13వ తేదీ (శుక్రవారం) అరెస్ట్ చేశారు. అల్లు అర్జున్ నటించిన పుష్పా -2 సినిమా చూసేందుకు వచ్చి అక్కడ జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతిచెందిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సంధ్యా థియేటర్ యజమానితోపాటు మేనేజర్‌ను అరెస్టు చేశారు. సరైన భద్రతా చర్యలు చేపట్టని సెక్యూరిటీ మేనేజర్‌ను కూడా అరెస్టు చేశారు. ముగ్గురిని అరెస్టు చేసి చిక్కడపల్లి పోలీసులు రిమాండ్‌కు పంపించారు.

Related Posts
Vanajeevi Ramayya: రామయ్య మృతి పై బండి సంజయ్, పవన్ కళ్యాణ్ సంతాపం
Vanajeevi Ramayya: రామయ్య మృతి పై బండి సంజయ్, పవన్ కళ్యాణ్ సంతాపం

వనజీవి రామయ్య మరణం: పర్యావరణ పరిరక్షణకు పెద్ద లోటు ఆరు దశాబ్దాల పాటు పర్యావరణ పరిరక్షణకు అంకితమయిన వనజీవి రామయ్య, పర్యావరణంపై చేసిన సేవలు, ఆయన జీవిత Read more

ఈడీ నోటీసులపై స్పందించిన కేటీఆర్‌
KTR responded to ED notices

హైదరాబాద్‌: ఫార్ములా-ఈ కేసులో ఈడీ జారీ చేసిన నోటీసులపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావు స్పందించారు. ఈ నెల 7న విచారణకు రావాలని ఈడీ నోటీసుల్లో Read more

Traffic Police : హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల కఠిన నిర్ణయం – మైనర్ల డ్రైవింగ్‌కు చెక్!
Traffic Police హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల కఠిన నిర్ణయం – మైనర్ల డ్రైవింగ్‌కు చెక్!

హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు.ప్రత్యేకంగా మైనర్ల చేత వాహనాల నడిపింపును నియంత్రించేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నారు.ఇటీవల రోడ్డు ప్రమాదాల సంఖ్య Read more

KCR: బీఆర్‌ఎస్‌ రజతోత్సవ వేళ.. పాట విడుదల చేసిన కేసీఆర్‌
KCR releases song on BRS silver jubilee

KCR : బీఆర్‌ఎస్‌ రజతోత్సవ వేళ ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ పాటను విడుదల చేశారు. మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ పాట రచించి Read more

×