KTR responded to ED notices

ఈడీ నోటీసులపై స్పందించిన కేటీఆర్‌

హైదరాబాద్‌: ఫార్ములా-ఈ కేసులో ఈడీ జారీ చేసిన నోటీసులపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావు స్పందించారు. ఈ నెల 7న విచారణకు రావాలని ఈడీ నోటీసుల్లో ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే, ఏసీబీ తనపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ రద్దు చేయాలని ఇప్పటికే హైకోర్టులో వేసిన కేసులో తీర్పు రిజర్వ్‌లో ఉందని తెలిపారు. హైకోర్టుపైనున్న గౌరవంతో.. తీర్పును వెలువరించేంత వరకు ఈ అంశంలో తనకు సమయం ఇవ్వాలని కోరారు. ఈ మేరకు ఈడీకి కేటీఆర్‌ సమాధానం పంపారు.

Advertisements
image
image

గత వారం కిందట ఫార్ములా-ఈ రేస్‌ వ్యవహారం కేసులో కేటీఆర్‌కు ఈడీ నోటీసులు పంపింది. ఈ నెల 7న విచారణకు రావాలని కోరింది. కేటీఆర్‌తో పాటు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అరవింద్‌ కుమార్‌కు, హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్‌ ఇంజినీర్‌ బీఎల్‌ఎన్‌ రెడ్డికి నోటీసులు ఇచ్చింది. ఈ నెల 2, 3న విచారణకు రావాలని అరవింద్‌, బీఎల్‌ఎన్‌ రెడ్డికి ఇచ్చిన నోటీసుల్లో ఆదేశించగా.. హాజరయ్యేందుకు గడువు కోరారు.

కేటీఆర్‌ దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టు మంగళవారం ఉదయం తీర్పును వెలువరించనున్నది. ఫార్ములా-ఈ రేస్‌లో ఏసీబీ కేసు నమోదు చేయడాన్ని సవాల్‌ చేస్తూ కేటీఆర్‌ హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఇప్పటికే హైకోర్టు ఇరువర్గాల వాదనలు విని.. తీర్పును రిజర్వ్‌ చేసింది. అయితే, తీర్పును వెలువరించే వరకు కేటీఆర్‌ను అరెస్ట్‌ చేయొద్దని ఆదేశించింది. ఈ కేసులో మంగళవారం ఉదయం 10.30 గంటలకు కోర్టు తీర్పును వెల్లడించే అవకాశం ఉంది.

Related Posts
మరోసారి ఆర్బీఐ కీలక నిర్ణయం..అందుకోసమేనటా..!
Once again, RBI key decision..what is the reason.

న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తాజాగా మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థలోకి భారీగా నిధులను జొప్పించేందుకు మరోసారి చర్యలను ప్రకటించింది. Read more

జార్ఖండ్ ఎన్నికలు..నేడు జార్ఖండ్‌కు అమిత్‌షా, రాజ్‌నాథ్‌ సింగ్
Jharkhand Elections.Amit Shah Rajnath Singh to Jharkhand today

న్యూఢిల్లీ : తూర్పు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ ప్రచారంలో భాగంగా కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ శనివారం (నవంబర్ 9) పోలింగ్ Read more

Chiranjeevi: సింగపూర్‌ చేరుకున్న చిరంజీవి దంపతులు
Chiranjeevi: సింగపూర్‌ చేరుకున్న చిరంజీవి దంపతులు

ప్రమాదం కలవరపెట్టిన సంఘటన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్‌కు సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదం అందరినీ కలవరపరిచింది. రివర్ వ్యాలీ Read more

ఇంద్రకీలాద్రిపై ప్రారంభమైన శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Sri Devi Sharan Navaratri celebrations started on Indrakiladri

Sri Devi Sharan Navaratri celebrations started on Indrakiladri విజయవాడ: కనకదుర్గమ్మ కొలువైన బెజవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వేకువజామునే జగన్మాతకు Read more

Advertisements
×