r krishnaiah

ఆర్.కృష్ణయ్య కొత్త పార్టీ..?

పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలని, జనగణనలో కులగణన చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో జరిగిన బీసీల సమరభేరి మహాసభలో ఆయన మాట్లాడారు. దేశంలో బీసీలందరికీ సమాన వాటా ఉండాలని అన్నారు. బీసీల రాజ్యాధికారం కోసం అవసరమైతే పొలిటికల్ పార్టీ పెట్టేందుకు సిద్ధం అవుతామని స్పష్టం చేసారు.

పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టి వారికి చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని మాజీ రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం త్వరలో చేపట్టబోయే జనగణనతోపాటు కులగణనా చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బీసీలంతా ఐక్యంగా ఉండి రాజ్యాధికారం వైపు అడుగులు వేద్దామని పిలుపునిచ్చారు. సోమవారం రవీంద్రభారతిలో బీసీల సమరభేరి మహాసభ జరిగింది. ఆర్‌.కృష్ణయ్య మాట్లాడుతూ దేశంలో బీసీలందరికీ సమాన వాటా లభించాలని, బీసీల రాజ్యాధికారం కోసం అవసరమైతే రాజకీయ పార్టీ పెట్టేందుకు సిద్ధమవుతామన్నారు.

కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసి వారి సంక్షేమానికి పాటుపడాలని ఆర్.కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు. ప్రైవేట్ రంగంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రం అమలు చేసే బీసీ రిజర్వేషన్లను 27 శాతం నుంచి 50 శాతానికి పెంచాలని కోరారు.

Related Posts
అయోధ్య రామాల‌యం దేశ ప్ర‌జ‌ల‌కు ప్రేర‌ణ‌ : ప్రధాని
Ayodhya Ram Temple is an inspiration to the people of the country.. Prime Minister

న్యూఢిల్లీ: అయోధ్య‌లో కొత్త నిర్మించిన రామ మందిరంలో రామ్‌ల‌ల్లాను ప్ర‌తిష్టాప‌న చేసి ఏడాది కావొస్తోంది. ఈ నేప‌థ్యంలో తొలి వార్షికోత్స‌వం సంద‌ర్భంగా ప్ర‌ధాని మోడీ దేశ ప్ర‌జ‌ల‌కు Read more

అమెరికాలో భారతీయ విద్యార్థుల సంఖ్య పెరిగింది: 15 సంవత్సరాల తర్వాత అగ్రస్థానం
students

2023-24 విద్యా సంవత్సరం కోసం విడుదలైన అధికారిక నివేదిక ప్రకారం, భారతదేశం 15 సంవత్సరాల తరువాత, అమెరికాలోని అంతర్జాతీయ విద్యార్థుల నమోదు లో అగ్రస్థానంలో నిలిచింది. ఈ Read more

విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవనం శంకుస్థాపన
విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ కార్యాలయం – భువనేశ్వరి శంకుస్థాపన

తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ ట్రస్ట్ నడిపిస్తున్న సేవా కార్యక్రమాలు మరింత విస్తరించనున్నాయి. త్వరలోనే విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఏర్పాటు కానుంది. ఈ నెల 6న ట్రస్ట్ Read more

పార్లమెంట్‌లో ‘ది సబర్మతి రిపోర్ట్‌’ను వీక్షించనున్న ప్రధాని మోడీ
PM Modi will watch The Sabarmati Report in Parliament

న్యూఢిల్లీ: గుజరాత్‌ అల్లర్లు, గోద్రా రైలు దహన కాండను ఆధారంగా చేసుకొని తెరకెక్కిన తాజా చిత్రం ‘ది సబర్మతి రిపోర్ట్‌’. ఈ చిత్రాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *